అమేథీ నుంచి రాహుల్‌ పోటీ? | Lok Sabha elections 2024: Rahul Gandhi To Contest From Amethi | Sakshi
Sakshi News home page

అమేథీ నుంచి రాహుల్‌ పోటీ?

Published Thu, Mar 7 2024 6:19 AM | Last Updated on Thu, Mar 7 2024 12:16 PM

Lok Sabha elections 2024: Rahul Gandhi To Contest From Amethi - Sakshi

అమేథీ: గతంలో పలుమార్లు తాను ప్రాతినిధ్యం వహించిన అమేథీ లోక్‌సభ స్థానం నుంచే ఈసారి కూడా రాహుల్‌ గాంధీ బరిలో దిగుతారని కాంగ్రెస్‌ పార్టీ అమేథీ జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షుడు ప్రదీప్‌ సింఘాల్‌ చెప్పారు. ఢిల్లీలో సమావేశం తర్వాత అమేథీకి తిరిగొచి్చన సింఘాల్‌ మీడియాతో మాట్లాడారు. ‘‘ అమేథీ నుంచి ఈసారి కూడా పార్టీ అభ్యర్ధి రాహుల్‌ గాంధీయే. త్వరలోనే ఆయన పేరును ప్రకటిస్తారు’’ అని అన్నారు. అయితే దీనిపై పార్టీ అధిష్టానం నుంచి ఇంకా ఎలాంటి స్పందన రాలేదు.

కాంగ్రెస్‌ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం ఇంకా జరగలేదు. ఆలోపే అభ్యర్థుల ఎంపికపై ఎలాంటి ప్రకటన వెలువడే అవకాశం లేదు. 2002 నుంచి 2019 దాకా అమేథీ నుంచి రాహుల్‌ గాంధీయే ప్రాతినిధ్యంవహిస్తూ వస్తున్నారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో రాహుల్‌ అమేథీతోపాటు కేరళలోని వయనాడ్‌లోనూ పోటీకి దిగారు. అమేథీలో బీజేపీ నాయకురాలు స్మృతి ఇరానీ చేతిలో ఓటమిపాలయ్యారు. అయితే వయనాడ్‌లో విజయం సాధించి పార్లమెంట్‌లో అడుగుపెట్టారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement