
కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ (ఫైల్‌ఫోటో)
లక్నో : కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ గురువారం తన నియోజకవర్గం అమేథిలో జనతా దర్బార్ నిర్వహించారు. జిల్లా కేంద్రం గౌరీగంజ్‌లోని పార్టీ కార్యాలయంలో పలు వర్గాల ప్రజల సమస్యలను రాహుల్ ఆలకిస్తూ..వారి నుంచి వినతులు స్వీకరించారు. మాజీ కేంద్ర మంత్రి, ఎంపీ సంజయ్ సింగ్ ఆయన భార్య అమితా సింగ్ రాహుల్‌తో పార్టీ, నియోజకవర్గ వ్యవహారాలను చర్చించారు.
యూపీలో పార్టీని బలోపేతం చేసేందుకు చేపట్టాల్సిన చర్యలపై రాహుల్‌తో చర్చించామని సంజయ్ సింగ్ తెలిపారు. ఇక పార్టీ కార్యకర్తలు, విద్యార్ధులు, వ్యాపార వర్గాలకు చెందిన ప్రతినిధులు పెద్దసంఖ్యలో రాహుల్‌ను కలిశారు. యూపీ మాజీ మంత్రి, సంగీతా ఆనంద్ సీనియర్ బీజేపీ నేత రామ్ లఖన్ పాసి కూడా రాహుల్‌తో సమావేశమయ్యారు. రాహుల్ గురువారం పలు కార్యక్రమాల్లో పాల్గొంటారని పార్టీ వర్గాలు తెలిపాయి.