
సాక్షి, న్యూఢిల్లీ : అమేథి లోక్‌సభ నియోజకవర్గంలో కాంగ్రెస్ కార్యకర్తలు పోలింగ్ బూత్‌లను ఆక్రమించి అక్రమాలకు పాల్పడుతున్నారని ఆ నియోజకవర్గ బీజేపీ అభ్యర్ధి, కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ఆరోపించారు. కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ ప్రోద్భలంతోనే కాంగ్రెస్ శ్రేణులు చెలరేగాయని ఆమె వ్యాఖ్యానించారు. అమేథిలో బూత్‌ల ఆక్రమణపై తాను ఈసీతో పాటు యూపీ అధికారులకు సమాచారం అందించానని, అధికార యంత్రాగం తగిన చర్యలు చేపడుతుందని ఆశిస్తున్నానని ఆమె పేర్కొన్నారు.
ఇక రాహుల్ దుశ్చర్యలను గమనించి అమేథి ఓటర్లు ఆయనను శిక్షించాలా లేదా అనేది తేల్చుకోవాలని సృతి ఇరానీ కోరారు. కాంగ్రెస్ చీఫ్ రాహల్ గాంధీతో అమేథిలో కేంద్ర మంత్రి స్మతి ఇరానీ బీజేపీ నుంచి తలపడుతున్న సంగతి తెలిసిందే. కాగా లోక్‌సభ ఎన్నికల అయిదో విడత పోలింగ్ దేశవ్యాప్తంగా ఏడు రాష్ట్రాల్లోని 51 స్ధానాల్లో కొనసాగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment