ప్రియాంక ఫ్రాడ్‌ అంటూ పోస్టర్లు | Posters Against Priyanka Have Been Put Up In Amethi | Sakshi
Sakshi News home page

అమేథిలో ప్రియాంకకు వ్యతిరేకంగా పోస్టర్లు

Published Wed, Mar 27 2019 4:11 PM | Last Updated on Wed, Mar 27 2019 4:13 PM

Posters Against Priyanka Have Been Put Up In Amethi - Sakshi

ప్రియాంకకు వ్యతిరేకంగా అమేధిలో వెలిసిన పోస్టర్లు..

లక్నో : లోక్‌సభ ఎన్నికల ప్రచార నిమిత్తం ప్రియాంక గాంధీ అమేధి నియోజకవర్గంలో పర్యటిస్తున్న నేపథ్యంలో ఆమెకు వ్యతిరేకంగా నియోజకవర్గంలో వెలిసిన పోస్టర్లు కలకలం రేపాయి. ప్రియాంకను మోసకారిగా పేర్కొంటూ అమేధిలో వెలిసిన పోస్టర్లపై కాంగ్రెస్‌ శ్రేణులు భగ్గుమంటున్నాయి. కాగా, అమేధికి కేవలం ఐదేళ్ల తర్వాత వస్తూ మీరు మమ్మల్ని ఎందుకు ఫూల్స్‌ను చేస్తున్నారని ఈ పోస్టర్లలో ప్రస్తావించారు.

2014 ఎన్నికల్లో ఎన్నో హామీలు గుప్పించిన మీరు మళ్లీ ఐదేళ్ల తర్వాత మమ్మల్ని మోసగించేందుకు వస్తున్నారని మరో పోస్టర్‌ వెలిసింది. ఎన్నికల సందర్భంగా ప్రజల్ని బురిడీ కొట్టించేందుకు మీరు చీరలు ధరించి వస్తుంటారు..అయితే ఇలాంటి ఎత్తుగడలు ఇక ఫలించవని మరో పోస్టర్‌ దర్శనిమిచ్చింది. ఎన్నికల ప్రచారం సందర్భంగా ప్రియాంక ప్రస్తుతం అమేధిలో ఉన్నారు. పార్టీ చీఫ్‌ రాహుల్‌ తరపున ప్రచారం నిర్వహిస్తున్న ప్రియాంక గురువారం తన తల్లి సోనియా గాంధీ నియోజకవర్గంలో గురువారం ప్రచారం చేపట్టనున్నారు. ఢిల్లీకి తిరుగుముఖం పట్టే ముందు ఆమె అయోధ్యను సందర్శించనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement