ఈ లోక్‌సభ ఎన్నికల్లో రాహుల్‌గాంధీ ఉత్తరప్రదేశ్‌లోని అమేథీ, కేరళలోని వయనాడ్ లోక్‌సభ స్థానాల నుంచి పోటీ చేస్తానని ప్రకటించినప్పటి నుంచీ ఈ విషయం రాజకీయవేత్తల్లోనూ, నెటిజన్లలోనూ చర్చనీయాంశమైంది. రాహుల్ ప్రకటన చుట్టూ అల్లుకుంటోన్న చర్చల్లో కొత్తగా అమూల్ కూడా జత కలిసింది. దేశంలోని ప్రతిచోటా రాహుల్ పోటీపై తలెత్తిన చర్చకి వ్యంగ్యాన్నీ, హాస్యాన్నీ జోడిస్తూ తన వ్యాపార ప్రకటనలో రాహుల్‌పై వేసిన క్యారికేచర్‌తో పాటు ‘వై నాట్ హావ్ ఇట్ విత్ బటర్’ అనే క్యాప్షన్‌ను కొద్దిగా మార్చి అందర్నీ ఆకట్టుకుంటోంది.
రాహుల్ వయనాడ్, అమేథీ నుంచి పోటీ చేస్తుండడాన్ని ప్రస్తావిస్తూ అమూల్ ‘‘ వైనాడ్ హావ్ ఇట్ విత్ బట్టర్–అమేథీ కా పరాఠా’’ (అమేథీ పరాఠాని వెన్నతో ఎందుకు తినకూడదు? అనే అర్థం వచ్చేట్టుగా) రెండు చేతుల్లో రెండు బ్రెడ్ స్లైసెస్ పట్టుకొని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ వేదికపై నుంచి ఉపన్యసిస్తున్నట్టు వేసిన క్యారికేచర్‌తో కూడిన అమూల్ కంపెనీ ప్రకటనని మంగళవారం ట్విట్టర్‌లో పెట్టింది. అమూల్ తాజాగా పెట్టిన ట్వీట్ సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్ చేస్తోంది. ఒక్కరోజులోనే దీనికి 5,200 లైక్స్ వచ్చాయి.
Comments
Please login to add a commentAdd a comment