
సమావేశంలో ప్రసంగిస్తున్న కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ
అమేథీ : సొంత నియోజక వర్గంలో పర్యటిస్తున్న కాంగ్రెస్ అధ్యక్షుడు, అమేథీ ఎంపీ రాహుల్ గాంధీ ప్రధాని నరేంద్ర మోదీపై విమర్శనాస్త్రాలు సంధించారు. మంగళవారం జరిగిన సమావేశంలో మాట్లాడుతూ.. ‘సాధారణంగా నాయకులు దేశ భవిష్యత్తు గురించి మాత్రమే ఆలోచిస్తారు. మాజీ ప్రధానులు నెహ్రూ, వాజ్‌పేయిలను గమనించండి. వారు ఎల్లప్పుడూ భవిష్యత్తు గురించే ఆలోచించేవారు. కానీ ప్రస్తుతం ఉన్న ప్రధాని ఎప్పుడూ గతాన్ని తవ్వుకుంటూ ద్వేషాన్ని పెంపొందించాలని ప్రయత్నిస్తున్నారంటూ’ విమర్శించారు.
ట్రిపుల్ ఐటీ, మెగా ఫుడ్ పార్క్, పేపర్ మిల్ వంటి పెద్ద పెద్ద ప్రాజెక్టులు అమేథీ నుంచి తరలి వెళ్లడానికి కేంద్రం, రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీజేపీనే కారణమని రాహుల్ గాంధీ ఆరోపించారు. దీంతో వేలాది మంది యువత ఉపాధి అవకాశాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రాజెక్టులను తిరిగి అమేథీకి రప్పించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. యువతకు ఉపాధి అవకాశాలు లభించినపుడే దేశం అభివృద్ధి చెందుతుందని రాహుల్ వ్యాఖ్యానించారు. రానున్న పది, పదిహేనేళ్లలో అమేథీ వేగంగా అభివృద్ధి చెందుతుందని, ఇప్పుడు సింగపూర్, కాలిఫోర్నియాల గురించి ప్రజలు ఎలా మాట్లాడుకుంటున్నారో అమేథీ గురించి కూడా అలాగే మాట్లాడతారని రాహుల్ గాంధీ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment