
రాహుల్ నామినేషన్ సందర్భంగా అమేధిలో రోడ్‌షోలో పాల్గొన్న ప్రియాంక గాంధీ
అమేధిలో నామినేషన్ దాఖలు చేసిన రాహుల్
లక్నో : కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ బుధవారం అమేధి నుంచి తన నామినేషన్ దాఖలు చేశారు. రాహుల్ తన తల్లి యూపీఏ చైర్‌పర్సన్ సోనియా గాంధీ, సోదరి ప్రియాంక గాంధీ, బావ రాబర్ట్ వాద్రాలు వెంటరాగా రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు సమర్పించారు. నామినేషన్ వేసే ముందు రాహుల్ మున్షిగంజ్-దరిపూర్ మీదుగా గౌరిగంజ్ వరకూ భారీ ర్యాలీ నిర్వహించారు.
ఇక నామినేషన్ కార్యక్రమం ముగిసిన వెంటనే బిహార్, పశ్చిమ బెంగాల్‌లో ప్రచార ర్యాలీల్లో పాల్గొనేందుకు బయలుదేరి వెళ్లారు. కాగా గాంధీల కుటుంబానికి కంచుకోట అమేధిలో రాహుల్ ఇప్పటికి మూడుసార్లు గెలుపొందారు. మరోవైపు అమేధితో పాటు కేరళలోని వయనాడ్‌లోనూ పోటీచేస్తున్న రాహుల్ ఇప్పటికే అక్కడ నామినేషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. అమేధిలో రాహుల్ గాంధీ కేంద్ర మంత్రి స్మృతి ఇరానీతో తలపడనున్నారు. గత ఎన్నికల్లోనూ రాహుల్ పై స్మృతి ఇరానీ పోటీ చేసి ఓటమి పాలయ్యారు.