
వాద్రా 'హోదా'కు ఎట్టకేలకు మంగళం
గత కొద్ది రోజులుగా కాంగ్రెస్, బీజేపీ శిబిరాల్లో చర్చనీయాంశమైన రాబర్ట్ వాద్రాకు 'ప్రత్యేక హోదా' విషయంలో కేంద్ర ప్రభుత్వం ఎట్టకేలకు తన నిర్ణయాన్ని ప్రకటించింది.
గత కొద్ది రోజులుగా కాంగ్రెస్, బీజేపీ శిబిరాల్లో చర్చనీయాంశమైన రాబర్ట్ వాద్రాకు 'ప్రత్యేక హోదా' విషయంలో కేంద్ర ప్రభుత్వం ఎట్టకేలకు తన నిర్ణయాన్ని ప్రకటించింది. ఎయిర్పోర్టుల్లో తనిఖీ అవసరం లేని ప్రత్యేక వ్యక్తుల జాబితా నుంచి రాబర్ట్ వాద్రా పేరును తొలగిస్తున్నట్లు పౌరవిమానయాన మంత్రిత్వ శాఖ బుధవారం ఉత్తర్వులు జారీచేసింది. దీంతో ఇకపై దేశంలోని అన్ని ఎయిర్పోర్టుల్లో వాద్రాను తనిఖీ చేసిన తర్వాతే ప్రయాణానికి అనుమతిస్తారు. అటు వాద్రా కూడా ప్రత్యేక వ్యక్తుల జాబితా నుంచి తన పేరును తొలగించాలని పలుమార్లు కోరిన సంగతి తెలిసిందే.
'ఫెంటాస్టిక్.. వాళ్లు చేసిన పనికి చాలా ఆనందిస్తున్నాను' అంటూ ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతించారు వాద్రా. 'ఒకవేళ ప్రత్యేక వ్యక్తుల జాబితా నుంచి నా పేరు తొలగించకపోతే.. నేనే అన్ని ఎయిర్ పోర్టులకు వెళ్లి నా పేరు మీద స్టిక్కర్ అంటిస్తా' అని రెండు రోజుల కిందట వాద్రా తన ఫేస్ బుక్ లో పోస్ట్ చేసిన సంగతి విదితమే.