సాక్షి, తిరుపతి: కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. స్వామి వారి సుప్రభాత సేవలో ఆయన పాల్గోన్నారు. శ్రీవారిని దర్శించకున్న వాద్రాకు ఆలయ అర్చకులు తీర్థ ప్రసాదాలు అందించారు. దర్శనాంతరం మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. సోనియా గాంధీ ఆరోగ్యం బాగుండాలని, కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని, రాహుల్ గాంధీ ప్రధాని కావాలని స్వామివారిని మొక్కుకున్నట్లు వాద్రా తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పార్టీ కోసం చాల కష్టపడుతున్నారని కోనియాడారు. ప్రియాంక గాంధీ మద్దతు రాహుల్‌కు ఎల్లప్పుడూ ఉంటుందని స్పష్టంచేశారు.
రద్దీ సాధారణం
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. ఒక్క కంపార్టుమెంట్లోనే భక్తులు వేచిఉన్నట్లు అధికారులు తెలిపారు. సర్వదర్శనానికి ఐదు గంటలు, స్లాట్ దర్శనానికి మూడు గంటల సమయం పడుతోంది. శనివారం తిరుమలలో వెంగమాంబ వర్దంతి వేడుకలు నిర్వహించనున్నట్టు టీటీడీ ఓ ప్రకటనలో తెలిపింది. తిరుమల శ్రీవారి ఆలయంలో 12 ఏళ్లకో సారి ఆగమోక్తంగా నిర్వహించే అష్టబంధన బాలా లయ మహాసంప్రోక్షణ కార్యక్రమం గురువారం శాస్త్రోక్తంగా ముగిసింది. శుక్రవారం నుంచి భక్తులు శ్రీవారి దర్శించుకోవడానికి అధికారులు అనుమతిస్తున్న విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment