అంబికా సోని(ఫైల్)
డెహ్రడూన్: జర్నలిస్ట్ పట్ల దురుసుగా ప్రవర్తించిన సోనియా గాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రాను కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు అంబికా సోనీ వెనకేసుకొచ్చారు. వాద్రాను వదిలేయాలని ఆమె సూచించారు. 'చట్టం అందరికీ సమానమే. వ్యక్తిగత స్వేచ్ఛను హరించే హక్కు ఎవరికీ లేదు. వాద్రాను లక్ష్యంగా చేసుకుని ఆయన వ్యక్తిగత జీవితంలోకి చొరబడాలని మీడియా ప్రయత్నిస్తోంది' అని అంబికా సోని వ్యాఖ్యానించారు. ఉత్తరాఖండ్ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జిగా అంబికా సోనీ వ్యవహరిస్తున్నారు.
శనివారం కాగ్ నివేదికపై ప్రశ్నించిన జర్నలిస్ట్‌పై రాబర్ట్ వాద్రా ఆగ్రహం వ్యక్తంచేస్తూ.. మైక్రోఫోన్‌ను పక్కకు నెట్టేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వాద్రా క్షమాపణ చెప్పాలని బ్రాడ్‌కాస్ట్ ఎడిటర్స్ అసోసియేషన్ కోరింది.