రాజ్యసభ సభ్యుడిగా రాజకీయాల్లోకి!.. రాబర్ట్ వాద్రా | Want To Serve People May Be Through Rajya Sabha Says Robert Vadra | Sakshi
Sakshi News home page

రాజ్యసభ సభ్యుడిగా రాజకీయాల్లోకి!.. రాబర్ట్ వాద్రా

Published Thu, May 9 2024 2:29 PM | Last Updated on Thu, May 9 2024 3:38 PM

Want To Serve People May Be Through Rajya Sabha Says Robert Vadra

ఢిల్లీ: అమేథీ ప్రజలు కోరుకుంటే తానూ పోటీ చేయడానికి సిద్ధమని ప్రియాంక గాంధీ భర్త 'రాబర్ట్ వాద్రా' గతంలో పలుమార్లు పేర్కొన్నారు. అయితే ఇటీవలే కాంగ్రెస్ పార్టీ అమేథీ బరిలోకి 'కిషోరి లాల్ శర్మ'ను దింపింది. ఈ తరుణంలో వాద్రా కీలక వ్యాఖ్యలు చేశారు.

అమేథీ ఎంపీ టికెట్ కేఎల్ శర్మకు కేటాయించడం వల్ల.. వ్యాపారవేత్త రాబర్ట్ వాద్రా రాజ్యసభ సభ్యుడిగా రాజకీయాల్లోకి వచ్చే సూచనలు ఉన్నట్లు పేర్కొన్నారు. కొంతకాలం తరువాత తాను ఖచ్చితంగా క్రియాశీల రాజకీయాల్లో చేరుతానని స్పష్టం చేశారు.

రాబర్ట్ వాద్రా మీడియాతో మాట్లాడుతూ.. నేను ఎవరికీ సమాధానం చెప్పడానికి రాజకీయాల్లోకి రావాలని కోరుకోవడం లేదు. నేను ప్రజలకు సేవ చేయడానికి రాజకీయాల్లోకి రావాలని అనుకుంటున్నట్లు పేర్కొన్నారు. అంతే కాకుండా కాంగ్రెస్ మీద మోదీ చేసిన వ్యాఖ్యలను ఖండించారు. ప్రధానిగా ఇలాంటి మాట్లాడటం తగదని పేర్కొన్నారు.

ప్రధాని మోదీ ఏది ఆరోపించినా వాటిని రుజువు చేయాలి. రుజువు చేయని పక్షంలో ఇలాంటి ఆరోపణలు చేయడం సరికాదని అన్నారు. రాహుల్, ప్రియాంకా ఇద్దరూ ప్రజలకు సేవ చేయడానికి పాటుపడుతున్నారు. ఈ సమయంలో మోదీ చేసిన వ్యాఖ్యలు సమంజసంగా లేదని వాద్రా అన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement