న్యూఢిల్లీ: కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ అల్లుడైన రాబర్డ్ వాద్రా భూముల లావాదేవీల్లో అక్రమాలేవీ లేవని హర్యానా ప్రభుత్వం నిర్ధారించడంలో కోడ్ ఉల్లంఘన జరగలేదని ఎన్నికల కమిషన్ పేర్కొనడంతో ఈ అంశంపై గురువారం కాంగ్రెస్, బీజేపీ మధ్య మాటల యుద్ధం మెుదలైంది. ఇందుకు సంబంధించి హర్యానా ప్రభుత్వంపై ఆరోపణలు చేసిన ప్రధాని నరేంద్ర మోదీతోపాటు, బీజేపీకూడా క్షమాపణ చెప్పాల్సిందేనని కాంగ్రెస్ గురువారం డిమాడ్ చేసింది.
ప్రధాని మోదీ, హూడా ప్రభుత్వంపై బాధ్యతారహితమైన ఆరోపణలు చేశారంటూ కాంగ్రెస్ ప్రతినిధి ఆనంద శర్మ విమర్శించారు. వాద్రా భూలావాదేవీలపై హూడా ప్రభుత్వం ఎన్నికల కమిషన్‌కు పూర్తి వాస్తవాలు సమర్పించలేదని బీజేపీ ఆరోపించింది.