ఫేస్బుక్లో వాద్రా సంచలన వ్యాఖ్యలు | government can not prove anything, comments robert vadra in facebook | Sakshi
Sakshi News home page

ఫేస్బుక్లో వాద్రా సంచలన వ్యాఖ్యలు

Published Thu, Jun 30 2016 12:46 PM | Last Updated on Thu, Jul 26 2018 5:23 PM

ఫేస్బుక్లో వాద్రా సంచలన వ్యాఖ్యలు - Sakshi

ఫేస్బుక్లో వాద్రా సంచలన వ్యాఖ్యలు

భూముల విషయంలో అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపణలున్న రాబర్ట్ వాద్రా.. ఈ అంశంపై ఫేస్ బుక్ లో సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఆయనకు పదవులు అంటూ ఏమీ లేవు.. కానీ ఉన్న గుర్తింపు మాత్రం తక్కువది కాదు. కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ అల్లుడు. అవును.. ఆయనే రాబర్ట్ వాద్రా. ఆయనగారి మీద లెక్కలేనన్ని ఆరోపణలున్నాయి. భూముల విషయంలో అక్రమాలు చేశారన్న ఆరోపణలపై వాద్రామీద ప్రస్తుతం విచారణ జరుగుతోంది. అయితే.. ఈ వ్యవహారంపై రాబర్ట్ వాద్రా ఫేస్బుక్లో సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను ఎప్పుడూ రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటారని, ప్రభుత్వాలు తన విషయంలో ఏమీ రుజువు చేయలేవని అన్నారు. ‘‘ఆధారాలు లేకుండా వాళ్లు ఏమీ రుజువు చేయలేరు. దాదాపు దశాబ్దం నుంచి ప్రభుత్వాలు నాపై తప్పుడు, నిరాధార ఆరోపణలు చేస్తున్నాయి’’ అని వాద్రా తన ఫేస్బుక్లో పోస్ట్ చేశారు.

హర్యానాలో డీఎల్ఎఫ్ సంస్థకు, వాద్రాకు చెందిన స్కైలైట్ హాస్పిటాలిటీ సంస్థకు మధ్య జరిగిన భూములఘొప్పందాలపై జస్టిస్ ఎస్ఎన్ ఢింగ్రా కమిషన్ విచారణ పూర్తిచేసిన ఒకరోజు తర్వాత ఆయనీ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. జస్టిస్ ఢింగ్రా కమిషన్ విచారణ సమయంలో వాద్రాను మాత్రం తమ ముందుకు పిలవలేదు. కమర్షియల్ లైసెన్సుల మంజూరుకు సంబంధించిన 250 ఫైళ్లను పరిశీలించింది. 26 మంది ప్రభుత్వాధికారులను విచారించింది. 2014 హర్యానా అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలకు ముందు వాద్రా భూ అక్రమాలపై బీజేపీ మండిపడింది. 2015 మే నెలలో హర్యానా ప్రభుత్వం జస్టిస్ ఢింగ్రా కమిషన్ను ఈ అక్రమాలపై విచారణకు నియమించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement