పార్లమెంటు సమావేశాలను అధికార కాంగ్రెస్ పక్ష సభ్యులే అడ్డుకుంటున్నారంటూ బీజేపీ విమర్శించింది. ఇంత గందరగోళం మధ్య సభలో ఎలాంటి బిల్లూ ఆమోదించవద్దని కోరింది.
న్యూఢిల్లీ: పార్లమెంటు సమావేశాలను అధికార కాం గ్రెస్ పక్ష సభ్యులే అడ్డుకుంటున్నారంటూ బీజేపీ విమర్శించింది. ఇంత గందరగోళం మధ్య సభలో ఎలాం టి బిల్లూ ఆమోదించవద్దని కోరింది. సోమవారం జరిగిన లోక్‌సభ బిజినెస్ అడ్వయిజరీ కమిటీ సమావేశంలో ఈ మేరకు డిమాండ్ చేసింది. వచ్చే వారం పలు కీలక బిల్లులు ప్రవేశపెట్టనున్నామని, విపక్షాలు మద్దతు తెలపాలని ప్రభుత్వం కోరింది. విపక్ష నాయకురాలు సుష్మా స్వరాజ్ మాట్లాడుతూ.. సహకరించడానికి తమకు అభ్యంతరం లేదని, అయితే కొన్ని కీలక సమస్యలను లేవనెత్తడానికి తమ సభ్యులకు అవకాశమివ్వాలని కోరారు. ‘ఈ రోజు కిష్ట్‌వార్‌లో హింస, అక్కడికి వెళ్లేందుకు యత్నించిన అరుణ్ జైట్లీ ని అడ్డుకోవడం, సోనియా అల్లుడు రాబర్ట్ వాద్రా భూస్కాం వంటి పలు సమస్యలను ప్రస్తావించాలని మా పార్టీ సభ్యులు యత్నిస్తే స్పీకర్ అనుమతించలేదు’ అని అన్నారు. తమ సభ్యులు ఎప్పుడు కీలక అంశాలను ప్రస్తావించడానికి ముందుకొచ్చినా.. అధికార కాంగ్రెస్ తమ తెలంగాణ వ్యతిరేక ఎంపీలను వెల్‌లోకి పంపి ఆందోళనలు చేయిస్తోందన్నారు.