
‘మోదీ అలాంటి మాటలు సిగ్గుచేటు’
న్యూఢిల్లీ: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ప్రధాని నరేంద్రమోదీపై సోనియాగాంధీ అల్లుడు రాబర్ట్‌వాద్రా ధ్వజమెత్తారు. మన్మోహన్‌పై మోదీ అలాంటి వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు. మాజీ ప్రధాని పరిణితికి, గొప్పతనానికి నిలువెత్తు నిదర్శనం అని అభివర్ణించారు. ‘ఇది దేశం మొత్తానికి పెద్ద సిగ్గుచేటు. మోదీ మాజీ ప్రధానిని కించపరిచేలా మాట్లాడారు.
అయినప్పటికీ ఎలాంటి మాటల దాడి చేయకుండా ఆయన పరిణితిని చాటుకున్నారు. మొన్న రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాద తీర్మానం చేసే సమయంలో మాట్లాడుతూ రాహుల్ చెప్పిన భూకంపం వచ్చి వెళ్లిందంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. ఇలాంటి మాటలు ప్రజల మనోభావాలను దెబ్బకొడతాయి’ అంటూ తన ఫేస్‌బుక్ పేజీలో రాసుకొచ్చారు. మన్మోహన్ పై మోదీ చేసిన వ్యాఖ్యలకు కాంగ్రెస్ పార్టీ తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే.