- రాబర్ట్ వాద్రాపై తెహల్కా ఆరోపణ
న్యూఢిల్లీ: కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రా సహా పలువురు ప్రముఖులు, ఉన్నతాధికారులు తమ స్థాయిని, అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఒక ప్రైవేటు విమానయాన సంస్థకు చెందిన విమానాల్లో పలు మార్లు ఉచితంగా ప్రయాణించారని, దాంతోపాటు ఇతర సౌకర్యాలు పొందారని తెహల్కా పత్రిక ఆరోపించింది. విదేశీ ప్రయాణాల సందర్భంగా వాద్రా తనకోసం, తన తల్లి, పిల్లల కోసం చాలాసార్లు ఈ సౌకర్యాలు పొందాడని పేర్కొంది.
అలాగే ఆ సంస్థ సౌకర్యాలు పొందినవారిలో పౌర విమానయాన శాఖలో వివిధ హోదాల్లో ఉన్న ఉన్నతాధికారులు పలువురు ఉన్నారని తెలిపంది. అయితే, ఈ ఆరోపణలను వాద్రా ఖండించారు. వాద్రా తరఫున ఐఎన్‌టీయూసీ ఉపాధ్యక్షుడు జగదీశ్ శర్మ ఒక ప్రకటన విడుదల చేశారు. విమాన ప్రయాణం సందర్భంగా ముందు వరుసల్లో సీట్లను తనకు ప్రయాణీకులు కానీ, లేదా ఆ సీట్లు ఖాళీగా ఉన్నప్పుడు అధికారులు కానీ తనకు ఆఫర్ చేసేవారని, ఇది వీఐపీలందరికీ ఇచ్చే సాధారణ మర్యాదేనని పేర్కొన్నారు.