Jagdish Sharma
-
ఇంతకీ రాహుల్ గాంధీ ఎక్కడున్నారు?
అత్యంత కీలకమైన బడ్జెట్ సమావేశాల్లో కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ దేశాన్ని విడిచి ఎంచక్కగా జాలీగా విదేశాలకు వెళ్లాడని వస్తున్న ఆరోపణలకు సమాధానంగా ఆ పార్టీ కార్యకర్త జగదీశ్ శర్మ ఒక రాహుల్ ఫొటోను విడుదల చేశాడు. ఆయన దేశాన్ని విడిచి పోలేదని, భవిష్యత్‌లో పార్టీని ఎలా వృద్ధిలోకి తీసుకొచ్చుకోవాలనే విషయాన్ని బాగా మేధోమదనం చేస్తున్నారన్నారు. తనకు అపఖ్యాతి వచ్చే విషయాన్ని రాహుల్ గాంధీ పెద్దగా పట్టించుకోవడంలేదని, దేశం ఎదుర్కొంటున్న సమస్యలపట్లే ఆయన అమితంగా ఆలోచిస్తున్నారని పేర్కొన్నారు. రాహుల్ ప్రస్తుతం ఉత్తరాఖండ్‌లో ఉన్నట్లు చెప్పారు. బెంగళూరులో కాంగ్రెస్ పార్టీ సమావేశం ఉంటుందని, అందులో ఆయన పార్టీ అధినేతగా మారే అవకాశం ఉందని, ఈ విషయం ఇష్టం లేనివారు పార్టీని విడిచి వెళ్లవచ్చని కూడా చెప్పారు. జగదీశ్ శర్మ విడుదల చేసిన ఫొటోలో వెనుక ఓ వ్యక్తి నిల్చుని ఉండగా అతడి ముందు రాహుల్ కూర్చొని ఉండి చేతిలో ల్యాండ్ ఫోన్‌తో కనిపిస్తున్నారు. కాగా, ఈ రాహుల్ గాంధీ ఫొటో 2008నాటిదని కాంగ్రెస్ పార్టీ పేర్కొంటుంది. మరోవైపు రాహుల్ విదేశాల్లో ఉన్నట్లు మరికొందరు కాంగ్రెస్ నేతలు చెప్పటం విశేషం. -
స్థాయిని అడ్డుపెట్టుకుని విమానాల్లో ఉచిత ప్రయాణాలు
రాబర్ట్ వాద్రాపై తెహల్కా ఆరోపణ న్యూఢిల్లీ: కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రా సహా పలువురు ప్రముఖులు, ఉన్నతాధికారులు తమ స్థాయిని, అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఒక ప్రైవేటు విమానయాన సంస్థకు చెందిన విమానాల్లో పలు మార్లు ఉచితంగా ప్రయాణించారని, దాంతోపాటు ఇతర సౌకర్యాలు పొందారని తెహల్కా పత్రిక ఆరోపించింది. విదేశీ ప్రయాణాల సందర్భంగా వాద్రా తనకోసం, తన తల్లి, పిల్లల కోసం చాలాసార్లు ఈ సౌకర్యాలు పొందాడని పేర్కొంది. అలాగే ఆ సంస్థ సౌకర్యాలు పొందినవారిలో పౌర విమానయాన శాఖలో వివిధ హోదాల్లో ఉన్న ఉన్నతాధికారులు పలువురు ఉన్నారని తెలిపంది. అయితే, ఈ ఆరోపణలను వాద్రా ఖండించారు. వాద్రా తరఫున ఐఎన్టీయూసీ ఉపాధ్యక్షుడు జగదీశ్ శర్మ ఒక ప్రకటన విడుదల చేశారు. విమాన ప్రయాణం సందర్భంగా ముందు వరుసల్లో సీట్లను తనకు ప్రయాణీకులు కానీ, లేదా ఆ సీట్లు ఖాళీగా ఉన్నప్పుడు అధికారులు కానీ తనకు ఆఫర్ చేసేవారని, ఇది వీఐపీలందరికీ ఇచ్చే సాధారణ మర్యాదేనని పేర్కొన్నారు. -
జగదీశ్ శర్మకు నాలుగేళ్ల జైలు
రాంచీ: దాణా కుంభకోణంలో చిక్కుకుని అనర్హతకు గురైన జేడీయూ మాజీ ఎంపీ జగదీశ్ శర్మకు ఇక్కడి ప్రత్యేక సీబీఐ కోర్టు శుక్రవారం నాలుగేళ్ల కఠిన జైలు శిక్ష, రూ.4 లక్షల జరిమానా విధించింది. మరో 18 మంది అధికారులు, దాణా వ్యాపారులకు కూడా జడ్జి సీతారాం ప్రసాద్ శిక్షలు వేశారు. దాణా స్కాంకు సంబంధించి 1990లలో గోడా ఖజానా నుంచి 1.16 కోట్లను అక్రమంగా విత్‌డ్రా చేసిన కేసులో కోర్టు వీరిని బుధవారం దోషులుగా తేల్చింది. -
లాలూ, జగదీశ్‌పై అనర్హత వేటు
న్యూఢిల్లీ: అనుకున్నట్లే అయింది. దాణా కుంభకోణంలో శిక్ష అనుభవిస్తున్న ఎంపీలు లాలూ ప్రసాద్ యాదవ్, జగదీశ్ శర్మ లోక్‌సభ సభ్యత్వాల్ని కోల్పోయారు. వీరిని అనర్హులుగా ప్రకటిస్తూ లోక్‌సభ ప్రధా న కార్యదర్శి బాల్ శేఖర్ ప్రకటన జారీ చేశారు. ఆర్జేడీ చీఫ్ లాలూపై మొత్తం పదకొండేళ్లు, జగదీశ్‌పై మొత్తం పదేళ్లు అనర్హత వేటు పడింది. ఐదేళ్లు శిక్ష పడ్డ లాలూ జైలు నుంచి విడుదలైన తర్వాత ఆరేళ్లు, నాలుగేళ్ల శిక్ష పడ్డ జగదీశ్ శిక్ష అనంతరం మరో ఆరేళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేయకుండా ఎన్నికల నియమావళి ప్రకారం నిషేధం విధించారు. ఈ సమాచారాన్ని ఎన్నికల సంఘానికి కూడా పంపారు. 65 ఏళ్ల లాలూ బీహార్‌లోని శరణ్ నియోజకవర్గం నుంచి 63 ఏళ్ల జగదీశ్ శర్మ జహానాబాద్ నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యా రు. కాగా, కళంకిత ప్రజాప్రతినిధుల అనర్హతపై ఈ ఏడాది జూలై 10న సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చిన విష యం తెలిసిందే. ఆ తీర్పును అనుసరించి పార్లమెంట్ సభ్యులపై వేటు పడడం ఇది రెండోసారి కాగా, లోక్‌సభ సభ్యులపై మొదటిసారి. కాంగ్రెస్ పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యుడు రషీద్ మసూద్‌పై ప్రజాప్రాతినిధ్య చట్ట ప్రకారం సోమవారం అనర్హత వేటు పడిన విషయం తెలిసిందే. సీబీఐ కోర్టు సెప్టెంబర్ 19న దోషిగా తీర్పిస్తూ ఆయనకు నాలుగేళ్ల జైలుశిక్ష ఖరారు చేసింది. అప్పటి నుంచీ ఆయనపై నిషేధం అమల్లోకి వస్తుందని రాజ్యసభ సెక్రెటేరియట్ తన నిషేధ ఉత్తర్వుల్లో పేర్కొంది. అయితే శిక్ష ఖరారైనా వెంటనే నిషే ధం పడకుండా ఉండేలా ఒక ఆర్డినెన్స్ కేంద్ర ప్రభుత్వం రూపొందించింది. దానిని ప్రతిపక్షాలు తీవ్రంగా విమర్శించడం, కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ కూడా దానిని ఒక నాన్సెన్స్గా అభివర్ణించడంతో ఆ ఆర్డినెన్స్‌ను రాష్ట్రపతి ఆమోదానికి పంపకుండానే వెనక్కి తీసుకున్న సంగతి తెలిసిందే. అటార్నీ జనరల్ వాహనవతి కూడా ఎంపీ సీట్లు ఖాళీ అయ్యాయని ప్రకటిస్తూ వెంటనే నోటిఫికేషన్ జారీ చేయాలని ఈ మధ్యనే లోక్‌సభ సెక్రటేరియట్‌కు చెప్పారు. -
లాలూ, జగదీశ్ శర్మలపై అనర్హత వేటు
-
లాలూ, జగదీశ్ శర్మలపై అనర్హత వేటు
న్యూఢిల్లీ : తాజాగా మరో ఇద్దరు లోక్‌సభ సభ్యులపై అనర్హత వేటు పడింది. ఆర్జేడీ నేత లాలూ ప్రసాద్ యాదవ్,జేడీయూ ఎంపీ జగదీశ్ శర్మపై వేటు పడింది. దాణా స్కాం కేసులో జైలు శిక్షకు గురైన లాలూప్రసాద్ యాదవ్‌తోపాటు ఎంపీ జగదీష్ శర్మ కూడా లోక్‌సభ సభ్యత్వాలను కోల్పోయారు. ఈ కేసులో లాలూకు ఆరేళ్లు, జగదీశ్ శర్మకు నాలుగేళ్లు జైలు శిక్ష పడిన విషయం తెలిసిందే. క్రిమినల్ కేసుల్లో రెండేళ్లకు పైగా శిక్ష పడిన ప్రజాప్రతినిధులను తక్షణం అనర్హులను చేస్తూ జూలై 10న సుప్రీంకోర్టు తీర్పు చెప్పిన విషయం విదితమే. కాగా సుప్రీంకోర్టు తీర్పు తర్వాత పదవిని కోల్పోయిన తొలి పార్లమెంటు సభ్యుడు రషీద్ మసూదే. దీంతో వీరిని అనర్హులుగా ప్రకటిస్తూ లోక్ సభ స్పీకర్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అలాగే వారు ప్రాతినిధ్యం వహిస్తున్న లోక్‌సభ స్థానాలు తక్షణమే ఖాళీలుగా ప్రకటించనున్నట్లు సమాచారం.