నరేంద్ర మోదీ క్షమాపణ చెప్పాలి: కాంగ్రెస్ | Congs seks apology from PM Modi over Haryana land deal claims | Sakshi
Sakshi News home page

నరేంద్ర మోదీ క్షమాపణ చెప్పాలి: కాంగ్రెస్

Published Thu, Oct 9 2014 3:22 PM | Last Updated on Wed, Aug 15 2018 2:20 PM

నరేంద్ర మోదీ క్షమాపణ చెప్పాలి: కాంగ్రెస్ - Sakshi

నరేంద్ర మోదీ క్షమాపణ చెప్పాలి: కాంగ్రెస్

న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రాపై అసత్య ఆరోపణలు చేసినందుకు క్షమాపణ చెప్పాలని ప్రధాని నరేంద్ర మోదీని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. రాబర్ట్ వాద్రాపై అసత్య చెందిన స్కైలైట్ హాస్పిటాలిటీ సంస్థ, రియల్ ఎస్టేట్ సంస్థ డీఎల్‌ఎఫ్‌ల మధ్య కుదిరిన భూ లావాదేవీకి సంబంధించిన ఒప్పందాన్ని రాష్ట్ర ప్రభుత్వం చట్టబద్ధం చేసిందని మోదీ ఆరోపించారు.

ఈ వ్యవహారంలో హర్యానా ప్రభుత్వం కోడ్ ఉల్లంఘించలేదని ఎన్నికల సంఘం తేల్చిచెప్పింది.  మోదీ క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ అధికార ప్రతినిధి ఆనంద్ శర్మ డిమాండ్ చేశారు. నిరాధార ఆరోపణలతో ప్రధాని పదవిని మోదీ అవమానించారని అన్నారు. ఇకకైన మోదీ తన వైఖరి మార్చుకోవాలని సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement