త్రిమూర్తుల చిత్త ప్రవృత్తి ప్రకోపం | MJ Akbar writes on Sonia gandhi's family corruption | Sakshi
Sakshi News home page

త్రిమూర్తుల చిత్త ప్రవృత్తి ప్రకోపం

Published Tue, May 17 2016 4:47 AM | Last Updated on Mon, Oct 22 2018 9:16 PM

త్రిమూర్తుల చిత్త ప్రవృత్తి ప్రకోపం - Sakshi

త్రిమూర్తుల చిత్త ప్రవృత్తి ప్రకోపం

బైలైన్
 
ఒక ఇటాలియన్ కోర్టు తీర్పు భారత ప్రజాస్వామ్యాన్ని ఎలా హతమార్చిందో చెప్పగలరా?  శక్తివంతమైన ఒక ప్రత్యేక కాంగ్రెస్ ‘‘కుటుంబం’’ తీసుకున్న లంచాలను అనుమతిస్తేనే ప్రజాస్వామ్యం సురక్షితంగా ఉంటుందా? పోలీసులను వారి విధులను నిర్వర్తించమని చెప్పినంత మాత్రాన ప్రజాస్వామ్యాన్ని కాలరాచివేసినట్టేనా?
 
ప్రాచీనులకు పోలికలు బాగా తెలుసు. మనిషి మానసిక స్థితులను వారు శరీరాంతర్గత స్రావాల ఆధారంగా (గ్రీకులు) నాలుగు రకాలుగా లేదా ‘ప్రవృ త్తులు’గా విభజించారు. రక్తం, కఫం, నల్ల పైత్యం, పచ్చ పైత్యం అనే నాలుగూ వారి దృష్టిలో దేహాంతర్గత ద్రవాలు. ప్రజా స్వామ్య వ్యవస్థలో విమర్శను లేదా వ్యతిరేకతను కూడా వాటిలో ఒకటిగా చేర్చడం ఉపయోగకరం. ఎన్డీఏ ప్రభుత్వ ద్వితీయ వార్షికోత్సవం సమీపిస్తుండగా అవన్నీ కలసి ప్రకో పిస్తుండటాన్ని చూస్తుంటే నాకీ విషయం హఠాత్తుగా స్ఫురించింది.

మొదటిది, రక్తం. అన్ని శరీరాల్లాగే రాజకీయ వ్యవస్థ కూడా రక్తం నిరంతరాయంగా ప్రవహించనిదే మనజాలదు. ప్రజాస్వామ్య వ్యవస్థ హృదయం, మస్తిష్కాలు ప్రభుత్వ అధీనంలో ఉంటే... అధికారానికి ఎదురు నిలిచే సంస్థల చేతుల్లో అభిప్రాయాలనే రక్తనాళాలుంటాయి. ప్రభుత్వం చేసే ప్రతి తప్పును పట్టి చూసే హక్కు ప్రతిపక్షానికి ఉంది. అతిశయీకరించడం, వక్రీకరించడం ఆ ద్వంద్వ యుద్ధ ఆయుధాలలో భాగం. కఫం, శాంతిని సూచిస్తుంది. ఆర్థిక లేదా రాజకీయ విజ్ఞాన శాస్త్రాలకు చెందిన స్వతంత్ర విశ్లేష కుల ప్రవృత్తి ఇది. వారి తీర్పు ప్రతికూల అంశాలవైపు ఎక్కు వగా మొగ్గు చూపే ధోరణితో ఉంటుంది. అయితే సాను కూల అంశాలపై వారి ప్రశంసల విశ్వసనీయతను అది పెంచుతుంది.  అధికారంలో ఉన్నవారు స్వీయ ప్రయోజన ప్రేరితులైతే తప్ప, ఇది వారికి తోడ్పడేదే.  

విషాదాన్ని సూచించే నల్ల పైత్యం అధికారం పట్ల మీడియా వైఖరిని బహుశా అత్యుత్తమంగా అభివ ర్ణిస్తుంది. పాత్రికేయులు అవహేళన చేయాలని చూస్తుంటారు. అది వారు సంధించే ప్రశ్నలకు వ్యంగ్యంతో కూడిన పదనును, ఉద్వేగాన్ని కలిగిస్తుంది. వారి సవాళ్లకు పోరాటపు మైకం ఉంటుంది. బహుశా ఇది 80% మీడియా విషయంలో నిజం కావచ్చు. దురదృష్టవశాత్తూ ఆ మిగతావారు అవినీతి పరులు. కాబట్టి అంతగా పట్టించుకోవాల్సిన పని లేదు. అమెరికాలో స్వేచ్ఛాయుతమైన పత్రికలు పుట్టినప్పటి నుంచీ ఎల్లో జర్నలిజంపై చర్చ కూడా పుట్టింది. భావ ప్రక టనా స్వేచ్ఛ ఉన్నంత కాలం బహుశా అది కూడా ఉంటుంది. సెన్సార్‌షిప్ ఒక్కటే దీనికి విరుగుడు అను కుంటాం. కానీ, అది నిజం కాదు. పాఠకులకు లేదా వీక్ష కులకు ఎల్లో జర్నలిజాన్ని తిరస్కరించే సామర్థ్యం ఉంది. అలాంటి అలుగ్గుడ్డలను కొనడాన్ని, చూడటాన్ని మానేసి సర్క్యులేషన్ లేదా టీఆర్‌పీలు తగ్గిపోయేలా చేయగలరు. నాలుగో ప్రవృత్తి అయిన పచ్చ పైత్యంతోనే ఉంది అసలు పెద్ద సమస్య.

కాలేయం నుంచి స్రవించి, పిత్తాశయంలో నిల్వ ఉండే పైత్యం తలకు ఎక్కితే... నిరాశానిస్పృహల వల్ల పెరిగి పెద్దదై దుర్మార్గపూరితంగా, విషపూరితంగా మారి నాలుకకు పాకుతుంది. ఇక ఆ వ్యాధిగ్రస్తులు స్పందించడానికి బదులు ప్రేలాపిస్తుంటారు, వాదించడానికి బదులు ఆరోపిస్తుం టారు, వివరించడానికి బదులు దుమ్మెత్తిపోస్తుంటారు, మాట్లాడటానికి బదులు ఆగ్రహంతో రగులుతుంటారు. ఇప్పటికే ఒక టీవీ ప్రధానికి వ్యతిరేకంగా దుర్మార్గమైన వ్యక్తి గత దాడిని ప్రసారం చేసింది. ఎలాంటి ఆధారాలూ లేని ఆరోపణలను ఏకరువు పెడుతూ తమ దుష్ట బుద్ధిని ఇంతైనా దాచుకోకుండా ఆ దాడి సాగింది. అదృష్టవశాత్తూ, అలాంటి ద్వేషం వారికే శత్రువుగా పరిణమిస్తుంది. దుమ్మెత్తి పోసేవారే చూసేవారికి దుష్టులుగా కనిపిస్తారు.

అయితే ఐదవది, కొత్తది అయిన మరో ప్రవృత్తి కూడా ఉంది. ప్రాచీనులు దాన్ని ఎన్నడూ పరిగణనలోకి తీసుకో లేదు. అసంబద్ధ నాటక రంగస్థలం మరింత ఆధునిక పరి ణామం కావడమే అందుకు కారణం కావచ్చు. ఒక ఇటాలి యన్ కోర్టు, భారతదేశంతో వీఐపీ హెలికాప్టర్‌ల అమ్మకం ఒప్పందం కుదుర్చుకునేందుకు అగస్టా వెస్ట్‌లాండ్ హెలి కాప్టర్ కంపెనీ ఎగ్జిక్యూటివ్‌లు లంచాలు ఇచ్చారని శిక్ష  విధిం చింది. ఆ విషయంపై కాంగ్రెస్ స్పందించిన తీరునే ఇందుకు ఉదాహరణగా చూడొచ్చు. లంచాలు ఇచ్చారంటే ఎవరో తీసుకున్నారు. ఆ డబ్బు యూపీఏ ప్రభుత్వంలో పలుకు బడిగల వారికి చేరిందనేది స్వయంవిదితమే. ఇంతవరకు విచారణాధికారులు ఈ లంచాల గొలుసులో అట్టడుగునున్న వారి వరకే చేరారు, అసలు సూత్రధారులను కాదు. కానీ కాంగ్రెస్ యుద్ధ బాకాల హోరును చూస్తుంటే.... అది ఇటాలియన్ కోర్టు మొదటి తీర్పులాగా లేదు, బైబిల్‌లోని తుది తీర్పులా ఉంది.

నేటి ప్రభుత్వం ‘ప్రజాస్వామ్యాన్ని హత్య చేస్తోం’దని ఢిల్లీలో జరిగిన ఓ ప్రదర్శనలో సోనియా గాంధీ ఆరోపిం చారు. అదే ప్రదర్శనలో కాంగ్రెస్ అత్యున్నత నాయక ద్వయం అధికారికంగా నాయక త్రయంగా మారింది. సోనియా, రాహుల్ గాంధీల మధ్య రాబర్ట్ వాద్రా చిత్రాన్ని ఉంచారు. ఒక ఇటాలియన్ కోర్టు తీర్పు భారత ప్రజాస్వా మ్యాన్ని ఎలా హతమార్చిందో చెప్పగలరా?  శక్తివంతమైన ఒక ప్రత్యేక కాంగ్రెస్ ‘‘కుటుంబం’’ తీసుకున్న లంచాలను అనుమతిస్తేనే ప్రజాస్వామ్యం సురక్షితంగా ఉంటుందా? ఇంతవరకు మనకు తెలిసింది ఒక ‘‘కుటుంబం’’ అని మాత్రమే. అనుమానితులను ఇంకా విచారించిన తర్వాత మరింత నిర్దిష్ట సమాచారం లభిస్తుందని ఆశించవచ్చు. పోలీసులను వారి విధులను నిర్వర్తించమని చెప్పినంత మాత్రాన ప్రజాస్వామ్యాన్ని కాలరాచివేసినట్టేనా?

ఒక పార్టీ నాయకత్వం తన మంచి ప్రవృత్తిని లేదా సంతులనాన్ని కోల్పోతే జరిగేది ఇదేనేమో అనుకుంటాను.  కాంగ్రెస్‌ను ఇప్పడు తమ శాశ్వత నియంత్రణలోకి తీసు కున్న కుటుంబానికి ముప్పు ఏర్పడటం తప్ప మరేదీ ఆ పార్టీని అంత వేగంగా లేచి నిలబడేలా చేయలేదను కుంటాను. ఆ లంచాలు పుచ్చుకున్న వ్యక్తి ఏ క్యాబినెట్ మంత్రో అయ్యుంటే... ఇలా భుజాలెగరేసి, అలా అతన్ని వదిలిపారేసేవారే. కానీ ఈ భుజాల కుదుపుతో పాటూ విన వస్తున్న అరుపులు, పెడబొబ్బలు మనకేదో చెబుతున్నాయి.
 
- ఎం.జె. అక్బర్
సీనియర్ సంపాదకులు
 వ్యాసకర్త పార్లమెంటు సభ్యులు, బీజేపీ అధికార ప్రతినిధి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement