
రాజ్యసభ ఎన్నికల్లో రాజస్థాన్ నుంచి కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ పోటీ చేస్తున్నారు. ఇందుకోసం ఆమె ఈరోజు(బుధవారం) నామినేషన్ దాఖలు చేయనున్నారు. రాజధాని జైపూర్ చేరుకున్న ఆమె వెంట రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ కూడా ఉన్నారు.
సోనియా గాంధీ లోక్‌సభ నుంచి కాకుండా రాజ్యసభ నుంచి పార్లమెంటుకు చేరుకుంటున్న ప్రస్తుత పరిస్థితుల్లో ప్రియాంక గాంధీ యూపీలోని రాయ్‌బరేలీ స్థానం నుంచి లోక్‌సభ ఎన్నికల్లో బరిలోకి దిగుతారనే ప్రచారం జరుగుతోంది. రాజస్థాన్ కాంగ్రెస్ అధ్యక్షుడు గోవింద్ సింగ్ దోటసార నివాసంలో సోనియాగాంధీ నామినేషన్ సెట్‌పై ఎమ్మెల్యేలందరూ సంతకాలు చేశారు.
#WATCH कांग्रेस संसदीय दल की अध्यक्ष सोनिया गांधी राज्यसभा चुनाव के लिए अपना नामांकन दाखिल करने के लिए जयपुर, राजस्थान पहुंचीं।
— ANI_HindiNews (@AHindinews) February 14, 2024
उनके बेटे और पार्टी सांसद राहुल गांधी और उनकी बेटी और पार्टी महासचिव प्रियंका गांधी वाड्रा उनके साथ हैं। pic.twitter.com/0oGUmMr1to
సీనియర్ కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ 1999 లోక్‌సభ సభ్యురాలుగా కొనసాగుతున్నారు. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలి లోక్‌సభ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆమె అమేథీ లోక్‌సభ సభ్యురాలిగానూ ఉన్నారు. ఆమె పార్లమెంటు ఎగువ సభకు వెళ్లడం ఇదే తొలిసారి.
ఫిబ్రవరి 8వ తేదీ నుంచి రాజ్యసభ ఎన్నికలకు నామినేషన్ల దాఖలు ప్రక్రియ ప్రారంభమైంది. నామినేషన్ పత్రాల పరిశీలన ఫిబ్రవరి 16న జరగనుంది. అభ్యర్థులు ఫిబ్రవరి 20లోగా తమ పేర్లను ఉపసంహరించుకోవచ్చు. అవసరమైతే ఫిబ్రవరి 27న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఓటింగ్ నిర్వహించి, అదే రోజు సాయంత్రం 5 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభించనున్నారు.