Nomination Today
-
సోనియా రాజ్యసభ నామినేషన్.. వెంటవచ్చిన రాహుల్, ప్రియాంక!
రాజ్యసభ ఎన్నికల్లో రాజస్థాన్ నుంచి కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ పోటీ చేస్తున్నారు. ఇందుకోసం ఆమె ఈరోజు(బుధవారం) నామినేషన్ దాఖలు చేయనున్నారు. రాజధాని జైపూర్ చేరుకున్న ఆమె వెంట రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ కూడా ఉన్నారు. సోనియా గాంధీ లోక్‌సభ నుంచి కాకుండా రాజ్యసభ నుంచి పార్లమెంటుకు చేరుకుంటున్న ప్రస్తుత పరిస్థితుల్లో ప్రియాంక గాంధీ యూపీలోని రాయ్‌బరేలీ స్థానం నుంచి లోక్‌సభ ఎన్నికల్లో బరిలోకి దిగుతారనే ప్రచారం జరుగుతోంది. రాజస్థాన్ కాంగ్రెస్ అధ్యక్షుడు గోవింద్ సింగ్ దోటసార నివాసంలో సోనియాగాంధీ నామినేషన్ సెట్‌పై ఎమ్మెల్యేలందరూ సంతకాలు చేశారు. #WATCH कांग्रेस संसदीय दल की अध्यक्ष सोनिया गांधी राज्यसभा चुनाव के लिए अपना नामांकन दाखिल करने के लिए जयपुर, राजस्थान पहुंचीं। उनके बेटे और पार्टी सांसद राहुल गांधी और उनकी बेटी और पार्टी महासचिव प्रियंका गांधी वाड्रा उनके साथ हैं। pic.twitter.com/0oGUmMr1to — ANI_HindiNews (@AHindinews) February 14, 2024 సీనియర్ కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ 1999 లోక్‌సభ సభ్యురాలుగా కొనసాగుతున్నారు. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలి లోక్‌సభ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆమె అమేథీ లోక్‌సభ సభ్యురాలిగానూ ఉన్నారు. ఆమె పార్లమెంటు ఎగువ సభకు వెళ్లడం ఇదే తొలిసారి. ఫిబ్రవరి 8వ తేదీ నుంచి రాజ్యసభ ఎన్నికలకు నామినేషన్ల దాఖలు ప్రక్రియ ప్రారంభమైంది. నామినేషన్ పత్రాల పరిశీలన ఫిబ్రవరి 16న జరగనుంది. అభ్యర్థులు ఫిబ్రవరి 20లోగా తమ పేర్లను ఉపసంహరించుకోవచ్చు. అవసరమైతే ఫిబ్రవరి 27న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఓటింగ్ నిర్వహించి, అదే రోజు సాయంత్రం 5 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభించనున్నారు. -
మంత్రి తుమ్మలకు ఎమ్మెల్సీ
నేడు నామినేషన్ సాక్షిప్రతినిధి, ఖమ్మం: రోడ్లు, భవనాలు, స్త్రీ, శిశు సంక్షేమశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఎమ్మెల్సీగా బరిలో దిగనున్నారు. ఎమ్మెల్యే కోటా నుంచి శాసన మండలికి జరుగుతున్న ఎన్నికల్లో తుమ్మలను పోటీ చేయించాలని టీఆర్ఎస్ అధిష్టానం నిర్ణరుుంచింది. నామినేషన్ వేసేందుకు గురువారం చివరిరోజు కావడంతో ఆయనతో పాటు ముఖ్యమంత్రి కేసీఆర్ మిగిలిన వారి పేర్లు ప్రకటించారు. శాసన సభ, శాసన మండలిలో సభ్యులు కాకుండా మంత్రులుగా ప్రమాణస్వీకారం చేసిన వారు ఆర్నెళ్లలోపు ఉభయ సభల్లో ఒక దానికి ఎన్నిక అయితేనే మంత్రి పదవిలో కొనసాగాల్సి ఉంటుంది. లేదంటే రాజ్యాంగ నిబంధనల ప్రకారం తమ పదవికి రాజీ నామా చేయాలి. గత ఏడాది డిసెంబర్ 16న తుమ్మల మంత్రిగా ప్రమా ణ స్వీకారం చేశారు. మే 15తో ఆయన మంత్రిగా కొనసాగబట్టి ఐదు నెలలైంది. ఇప్పట్లో ఈ ఎన్నికలు మాత్రమే ఉండటంతో తప్పని సరి పరిస్థితుల్లో మండలికి ఎన్నిక కావాలి. అందుకే సీఎం.. మంత్రి తుమ్మలకు శాసన మండలి టిక్కెట్ ఖరారు చేశారు. మండలిలో ఖాళీ అయిన స్థానాల్లో ఎవరికి టిక్కెట్ ఇవ్వాలన్న విషయమై కేసీఆర్‌తో పాటు కేటీఆర్ పార్టీ ఎమ్మెల్యేల అభిప్రాయం తీసుకున్నట్లు సమాచారం. ఈ ఎమ్మెల్యేల నిర్ణయంతో తొలుత బుధవారం రాత్రి తుమ్మల, కడియం పేర్లు ఖరారు చేశారు. గురువారం ఉదయం 10 గంటలకు తుమ్మల నామినేషన్ వేయనున్నారు. ఆయన నామినేషన్ కార్యక్రమానికి జిల్లాలోని టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు హైదరాబాద్ తరలివెళ్లారు.