రాబర్ట్ వాద్రా భూముల లావాదేవీలపై ఢిల్లీ హైకోర్టులో పిల్ | A PIL in Delhi High on Robert Vadra land transactions | Sakshi
Sakshi News home page

రాబర్ట్ వాద్రా భూముల లావాదేవీలపై ఢిల్లీ హైకోర్టులో పిల్

Published Sat, Apr 19 2014 8:46 PM | Last Updated on Sat, Sep 2 2017 6:15 AM

రాబర్ట్ వాద్రా

రాబర్ట్ వాద్రా

 న్యూఢిల్లీ: ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రాకు చెందిన కంపెనీలు హర్యానాలోని గుర్గావ్‌లో జరిపిన భూముల లావాదేవీలపై సీబీఐతో దర్యాప్తు జరింపిచాలని కోరుతూ ఢిల్లీ హైకోర్టులో ఓ ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్)దాఖలైంది. వ్యవసాయ భూములను ప్రతిపాదిత అవసరాల కోసం కాకుండా వేరే అవసరాలకువాడుకోవడానికి అనుమతించడంపైన కూడా విచారణ జరపాలని పిటిషన్‌లో కోరారు.

ప్రియాంకాగాంధీ భర్త అయిన వాద్రాకు చెందిన స్కైలైట్ హాస్పిటాలిటీ ప్రైవేట్ లిమిటెడ్, దాని అనుబంధం కంపెనీలు రాజస్థాన్‌లో నిర్వహించిన భూముల లావాదేవీలపైనా దర్యాప్తు జరపాలని విజ్ఞప్తి చేశారు. కోర్టు ఈ పిటిషన్‌ను ఈ నెల 23న విచారించనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement