న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రా ఫొటో.. ఆ పార్టీ పోస్టర్లపై తొలిసారి దర్శనమిచ్చింది. దేశ రాజధాని ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ శుక్రవారం 'సేవ్ డెమోక్రసీ' పేరుతో నిర్వహించిన మార్చ్లో ఈ దృశ్యం కనిపించింది. ఈ ర్యాలీలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, సోనియా, రాహుల్ గాంధీ తదితరులు పాల్గొన్నారు.
ఈ ర్యాలీ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు పోస్టర్లు ఏర్పాటు చేశారు. ర్యాలీ వేదిక జంతర్ మంతర్ వద్ద ఏర్పాటు చేసిన పోస్టర్లలో సోనియా, రాహుల్తో పాటు వాద్రా ఫొటోలు కనిపించాయి. గాంధీ కుటుంబానికి విధేయుడైన జగదీష్ శర్మ వీటిని ఏర్పాటు చేసినట్టు సమాచారం. కాంగ్రెస్ పార్టీ పోస్టర్లపై 47 ఏళ్ల వాద్రా ఫొటో కనిపించడం ఇదే తొలిసారి.
ఎన్నికల్లో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ తరపున ప్రియాంక గాంధీ ప్రచారం నిర్వహించినా, ఆమె భర్త వాద్రా మాత్రం రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. హరియాణాలో భూకుంభకోణంలో ఆయనపై ఆరోపణలు వచ్చాయి.
కాంగ్రెస్ పోస్టర్లపై సోనియా అల్లుడు
Published Fri, May 6 2016 8:20 PM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM
Advertisement
Advertisement