సాక్షి, న్యూఢిల్లీ : కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీకి ఎస్‌పీజీ భద్రతను తొలగించడంపై ఆమె భర్త రాబర్ట్ వాద్రా కేంద్ర సర్కార్‌పై ధ్వజమెత్తారు. గత నెలలో ప్రియాంక నివాసంలోకి ఓ కారు దూసుకురావడం భద్రతా లోపాలను ఎత్తిచూపిన క్రమంలో ఎస్‌పీజీ భద్రతను తొలగించకూడదని వ్యాఖ్యానించారు. దేశవ్యాప్తంగా భద్రత విషయంలో రాజీపడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. భద్రతా లోపాలను మహిళల భద్రతకు ముడిపెడుతూ వాద్రా ఫేస్‌బుక్ పోస్ట్‌లో ప్రభుత్వ తీరును ఆక్షేపించారు.
‘ప్రియాంకకు, నా కుమార్తె, కుమారుడు లేదా నాకు గాంధీ కుటుంబానికే భద్రత కరవవడం కాదు..దేశంలో మహిళలకు భద్రమైన పరిస్థితి కల్పించాల్సి ఉండగా, దేశవ్యాప్తంగా భద్రతపై రాజీపడుతున్నారు..యువతులు, బాలికలపై లైంగిక దాడులు కొనసాగుతున్నాయి..ఎలాంటి సమాజాన్ని మనం ఏర్పరుస్తున్నా’మని వాద్రా ఆ పోస్ట్‌లో ఆవేదన వ్యక్తం చేశారు. కాగా కేంద్ర ప్రభుత్వం ఇటీవల గాంధీ కుటుంబానికి ఎస్‌పీజీ భద్రతను తొలగించి జడ్ క్యాటగరీ భద్రతను కల్పించిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment