నంద్యాల: అడ్డంగా దొరికిన టీడీపీ దొంగ ఓటర్లు
నంద్యాల: ఉప ఎన్నిక పోలింగ్ ముగియయడానికి సమయం దగ్గరపడుతున్న కొద్దీ అధికార తెలుగుదేశం పార్టీ అక్రమాలు తారాస్థాయికి చేరాయి. చుట్టుపక్కల ప్రాంతాల నుంచి భారీ సంఖ్యలో దొంగ ఓటర్లను రంగంలోకి దింపింది. అయితే, ఆ దొంగ ఓటర్లను ఎన్నికల పరిశీలకులు పట్టుకోవడం సంచలనంగా మారింది.
నంద్యాలలోని నందమూరి నగర్ పోలింగ్ కేంద్రం వద్ద 10 మంది టీడీపీ దొంగ ఓటర్లను ఎన్నికల పరిశీలకులు పట్టుకున్నారు. ఈ దృశ్యాలను చూసి మరో 20 మంది దొంగ ఓటర్లు అక్కడి నుంచి పారిపోయారు.
ఇలా బయటపడింది:పోలింగ్ కేంద్రానికి సమీపంలో టాటా ఏస్ వాహనంలో కూర్చొన్న కొందరు మహిళలు.. ఓట్ల గురించి మాట్లాడుకుంటుండగా స్థానికులు గుర్తించారు. ‘అమ్మా, మీరు ఎవరు? ఎక్కడి నుంచి వచ్చారు?’ అని స్థానికులు ప్రశ్నించగా పొంతనలేని సమాధానాలు చెప్పారు. అనుమానంతో స్థానికులు ఎన్నికల పర్యవేక్షకులకు సమాచారం అంచారు.
భూమా చెబితనే వచ్చాం: అధికారులు వచ్చి, ఆ మహిళల దగ్గరున్న ఆధార్, రేషన్, ఇతర కార్డులను పరిశీలించగా.. వారు నంద్యాల వాసులు కాదని తేలిసింది. భూమా కుటుంబ సభ్యులు చెబితేనే ఓట్లు వేయడానికి వచ్చామని వారు అధికారులతో చెప్పారు. దీంతో వాహనాన్ని స్వాధీనం చేసుకున్న అధికారలు.. దొంగ ఓటర్లను పోలీస్ స్టేషన్‌కు తరలించారు.