వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌లోకి టీడీపీ నేత.. | TDP leader Mustak joins ysr congress party | Sakshi
Sakshi News home page

వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌లోకి టీడీపీ నేత..

Published Mon, Aug 21 2017 2:02 PM | Last Updated on Fri, Oct 19 2018 8:10 PM

వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌లోకి టీడీపీ నేత.. - Sakshi

వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌లోకి టీడీపీ నేత..

నంద్యాల: వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలోకి వలసలు కొనసాగుతున్నాయి. నంద్యాల ఉప ఎన్నికకు సమయం దగ్గర పడుతున్న వేళ కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా టీడీపీ నేత ముస్తాక్‌ సోమవారం పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు. వైఎస్‌ జగన్‌ ఈ సందర్భంగా ముస్తాక్‌కు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కాగా ముస్తాక్‌... టీడీపీ ఎమ్మెల్సీ ఫరూఖ్‌ మేనల్లుడు, హరున్‌ మోటార్స్‌ అధినేత. పార్టీలో చేరిన అనంతరం ముస్తాక్‌ మాట్లాడుతూ.. వైఎస్‌ఆర్‌ సీపీ గెలుపుకు కృషి చేస్తామన్నారు.

మరోవైపు రామకృష్ణారెడ్డి డిగ్రీ కాలేజీ అధినేత రామకృష్ణారెడ్డి...వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి మద్దతు ప్రకటించారు. కాగా నంద్యాల ఉప ఎన్నికల ప్రచారం నేటితో ముగియనుంది. ఈ నెల 23న ఎన్నికలు, 28న ఫలితాలు వెలువడతాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement