
టీడీపీ డబ్బుల పంపకం: ఉద్రిక్తత
పట్ణంలోని గాంధీనగర్ పోలింగ్ కేంద్రం వద్ద ఓటర్లకు డబ్బులు పంచుతోన్న టీడీపీ నాయకులను వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. దీంతో రెంచ్చిపోయిన టీడీపీ గుండాలు.. వైఎస్సార్‌సీపీ శ్రేణులపై విచక్షణారహితంగా దాడి చేశారు.
- గాంధీనగర్‌లో తీవ్ర ఉద్రిక్తత
- కెమెరాలకు దొరికిపోయిన ఒంగోలు తెలుగు తమ్ముళ్లు
- అక్రమాన్ని అడ్డుకున్న వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై దాడి
నంద్యాల: పట్ణంలోని ఏడో వార్డు గాంధీనగర్ పోలింగ్ కేంద్రం వద్ద దొంగ ఓటర్లకు డబ్బులిచ్చి పురమాయిస్తోన్న టీడీపీ నాయకులను వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. దీంతో రెంచ్చిపోయిన టీడీపీ గుండాలు.. వైఎస్సార్‌సీపీ శ్రేణులపై విచక్షణారహితంగా దాడి చేశారు. టీడీపీ అక్రమాలను అడ్డుకోకుండా పోలీసులు చోద్యం చూస్తున్న దృశ్యాలు కూడా ఈ వీడియోలో రికార్డయ్యాయి.
వాళ్లు అన్నా రాంబాబు మనుషులే: బుధవారం సాయంత్రం 4 గంటల సమయంలో గాంధీనగర్ పోలింగ్ స్టేషన్ సమీపంలో కొందరు టీడీపీ నాయకులు డబ్బులు పంచుతూ కనిపించారు. వీరిని ప్రకాశం జిల్లా గిద్దలూరు మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు అనుచరులుగా గుర్తించారు. డబ్బు పంపకాన్ని అడ్డుకోవడంతో రెంచ్చిపోయిన రాంబాబు అనుచరులు.. వైఎస్సార్‌సీపీ ఈసీఈ సభ్యుడు రాజగోపాల్ రెడ్డి, మరికొందరిపై దాడి చేసి గాయపర్చారు.
ఈసీకి ఫిర్యాదు చేస్తాం: ఒంగోలు జిల్లాకు చెందిన టీడీపీ నాయకుడి అనుచరులు నంద్యాలలో ఉండటమేకాక, డబ్బులు పంచుతూ దొరికారని, వాళ్లను అడ్డుకున్న తమపై దాడి చేశారని వైఎస్సార్‌సీపీ నాయకులు చెప్పారు. ఈ వ్యవహారంపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని, వీడియోలను కూడా అందిస్తామని పేర్కొన్నారు.