మరికొద్ది గంటల్లో ఉప ఎన్నిక పోలింగ్ ప్రారంభంకానుండగా, నంద్యాల వైఎస్సార్‌సీపీ అభ్యర్థి శిల్పా మోహన్‌రెడ్డి ఇంటివద్ద పోలీసులు హల్‌చల్ చేశారు. సోమవారం రాత్రి నంద్యాలలోని శిల్పా ఇంటికి వచ్చిన పోలీసులు.. అక్కడున్న సిబ్బంది, పోలింగ్ ఏజెంట్లను బలవంతంగా బయటికి పంపేశారు. దీంతో ఆగ్రహించిన శిల్పా మోహన్‌రెడ్డి పోలీసుల తీరును తప్పుపట్టారు. ఏకపక్షంగా ఇళ్లపై దాడులు చేయడం సరికాదని హితవుపలికారు. కానీ పోలీసులు ఎంతకీ వినిపించుకోలేదు.