నంద్యాల ప్రజలు ధర్మం, న్యాయం వైపు నిలబడతారని.. ధర్మాన్ని గెలిపిస్తారని వైఎస్సార్ సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ప్రగాఢ విశ్వాసం వ్యక్తం చేశారు. అధికార టీడీపీ నాయకులు ఎన్ని దౌర్జన్యాలు చేసినా ఓటర్లు ప్రశాంతంగా ఓటేశారని కితాబిచ్చారు. వైఎస్సార్ సీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం సాయంత్రం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... ప్రజాస్వామ్యాన్ని సీఎం చంద్రబాబు అపహాస్యం చేశారని ధ్వజమెత్తారు. ఉప ఎన్నికను అత్యంత ఖరీదైన వ్యవహారంగా మార్చేశారని మండిపడ్డారు.