నంద్యాల ఉప ఎన్నికల్లో ఓటమి భయంతో తెలుగుదేశం పార్టీ డబ్బుల పంపిణీకి తెగబడింది. పబ్లిక్గానే టీడీపీ నేతలు ఒక్కో ఓటుకు భారీ మొత్తంలో చెల్లిస్తూ అడ్డంగా బుక్ అయ్యారు. నంద్యాలలోని 20వ వార్డులో రైతు నగర్ గ్రామ సర్పంచి కొండారెడ్డి రూ. 5 వేలు పంచుతూ కెమెరాకంటికి దొరికి పోయాడు. క్రాంతి నగర్‌లో ఇంటి ఇంటికి తిరుగుతూ టీడీపీ తరపున డబ్బుల పంపిణీ చేశాడు.