నంద్యాల ఉప ఎన్నికలో భాగంగా బుధవారం జరిగిన పోలింగ్ ప్రశాంతంగా సాగిందని, రికార్డు స్థాయిలో పోలింగ్ శాతం నమోదవుతోందని ప్రధాన ఎన్నికల కమిషనర్ భన్వర్‌లాల్ చెప్పారు. నంద్యాల ఉప ఎన్నిక సరళిపై బుధవారం సాయంత్రం ఆయన మీడియాతో మాట్లాడారు. రెండు దశాబ్ధాల్లో అత్యధిక శాతం: నంద్యాల నియోజకవర్గవ్యాప్తంగా సాయంత్ర 5 గంటల వరకు 76 శాతానికి పైగా ఓటింగ్ నమోదయిందని సీఈసీ భన్వర్‌లాల్ చెప్పారు. ఆరు గంటల తర్వాత కూడా క్యూలైన్లలో నిల్చున్నవారికి ఓటు వేసే అవకాశం ఉంటుందికాబట్టి మొత్తం పోలింగ్ శాతం 82 శాతానికి చేరువ కావచ్చన్నారు. గడిచిన రెండు దశాబ్ధాల కాలంలో ఇది రికార్డు పోలింగ్ శాతమని ఆయన పేర్కొన్నారు.