
నంద్యాల ఓటర్లకు వైఎస్‌ఆర్ సీపీ విజ్ఞప్తి
నంద్యాల ఉప ఎన్నికలో అక్రమాలు జరిగినా, ఓటర్లను ప్రలోభపెట్టినా తమ దృష్టికి తీసుకురావాలని ఓటర్లకు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు విజ్ఞప్తి చేశారు.
సాక్షి, నంద్యాల : నంద్యాల ఉప ఎన్నికలో అక్రమాలు జరిగినా, ఓటర్లను ప్రలోభపెట్టినా తమ దృష్టికి తీసుకురావాలని ఓటర్లకు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు విజ్ఞప్తి చేశారు. అక్రమాలు, ప్రలోభాలను ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకు వెళతామని తెలిపారు. 79812 30095, 79814 29455 నంబర్లకు ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చని వైఎస్‌ఆర్ సీపీ నేతలు సూచించారు.
కాగా నంద్యాల వైఎస్‌ఆర్ నగర్‌లో ఘర్షణ వాతావరణం నెలకొంది. పోలింగ్ బూత్‌కు రెండొందల మీటర్లలోపే టీడీపీ నేతలు, ఓటర్లకు డబ్బులు పంచుతుండగా, వైఎస్‌ఆర్ సీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ఇరువర్గాల మధ్య తీవ్ర వాగ్వివాదం చోటుచేసుకుంది.
పలుచోట్ల పోలింగ్ కు ఆటంకం
కాగా పలు పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎంలు మొరాయించడం, లైటింగ్ సమస్యలు తలెత్తడంతో...పోలింగ్‌కు ఆటంకం కలుగుతోంది. బూత్ నంబర్ 152లో సరిగా వెలుతురు లేకపోవడంతో .....ఓటర్లు ఇబ్బంది పడుతున్నారు. అటు ఎన్టీఆర్ నగర్‌లోని బూత్ నెంబర్ 19Aలో ఈవీఎం మొరాయించింది.
పోలింగ్ బూత్ నెంబర్ 72లో ఈవీఎం తెరుచుకోకపోవడంతో .....గందరగోళం తలెత్తింది. ఎస్పీజీ హైస్కూల్‌లోని బూత్ నంబర్ 96లో ఈవీఎంలు పనిచేయకపోవడంతో...పోలింగ్ ప్రారంభం కాలేదు. అటు గోస్పాడు మండల పరిధిలో పలు చోట్ల ఈవీఎంలు మొరాయించాయి. ఈవీఎంలు మొరాయించడంతో యాళ్లూరు, ఎం కృష్ణాపురంలో పోలింగ్ ప్రారంభం కాలేదు.