గడువు ముగిసినా మంత్రులు, టీడీపీ నాయకులు నంద్యాలలోనే ఉన్నారని వైఎస్సార్ సీపీ నాయకులు మంగళవారం ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి, కె.శివకుమార్, చల్లా మధుసూదన్ రెడ్డి.. ఎన్నికల ప్రధానాధికారి భన్వర్‌లాల్‌ను కలిసి ఈ మేరకు విజ్ఞాపనపత్రం సమర్పించారు. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించిన ఆంధ్రజ్యోతి-ఏబీఎన్ చానల్‌పైనా ఫిర్యాదు చేశారు. ఇవాళ, రేపు అధికార పార్టీ నేతలు నిర్వహించే విలేకరుల సమావేశాలపైనా కూడా దృష్టి సారించాలని కోరారు.