మైనారిటీలు అధికంగా నివసించే వార్డుల్లో తెలుగుదేశం కార్యకర్తలు వీరంగం సృష్టించారు.
- ఫరూఖ్‌నగర్‌లో రెచ్చిపోయిన తెలుగు తమ్ముళ్లు
- రహీం, కలాంలపై సుబ్బారెడ్డి వీరంగం
- పోలీసుల ప్రేక్షకపాత్ర.. ప్రశ్నించిన శిల్పా
నంద్యాల: మైనారిటీలు అధికంగా నివసించే వార్డుల్లో తెలుగుదేశం కార్యకర్తలు వీరంగం సృష్టించారు. నంద్యాలలోని ఫరూఖ్‌నగర్‌లో వైఎస్సార్‌సీపీ మైనారిటీ నేతలు రహీం, ఏడోవార్డు కౌన్సిలర్ అబ్దుల్ కలాంలపై టీడీపీ నేత ఏవీ సుబ్బారెడ్డి దాడికి పాల్పడ్డారు. మైనారిటీలంతా మూకుమ్మడిగా వైఎస్సార్‌సీపీకి ఓటేశారనే దుగ్ధతోనే టీడీపీ తమపై దాడులు చేస్తోందని బాధితుడు రహీం ఆరోపించారు.
ఇష్టారీతిగా కొడుతూ ‘‘మేం మిమ్మల్ని కొట్టిన విషయం ఎవడికి చెప్పుకుంటావో చెప్పుకో, ఏం చేసుకుంటారో చేసుకోండి’’ అని ఏవీ సుబ్బారెడ్డి దూషించినట్లు మైనారిటీ నేత రహీం మీడియాకు చెప్పారు. కాగా, ఫారూఖ్‌నగర్‌లో ఘర్షణ గురించి తెలుసుకున్న వైఎస్సార్‌సీపీ అభ్యర్థి శిల్పా మోహన్‌రెడ్డి.. అక్కడికి వెళ్లి రహీంతో మాట్లాడారు. ఈ వ్యవహారంలో టీడీపీకి వత్తాసుగా ప్రేక్షపాత్ర వహించిన పోలీసుల తీరును శిల్పా ప్రశ్నించారు.