రాబోయే మహా సంగ్రామానికి నంద్యాలే నాంది కావాలని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు. చంద్రబాబు చేస్తున్న మోసాలకు, అన్యాయాలకు, అధర్మాలకు వ్యతిరేకంగా నంద్యాల ప్రజలు ఓటు వేయాలని ఆయన పిలుపునిచ్చారు. వైఎస్‌ఆర్ సీపీ అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డికి సంపూర్ణ మద్దతు పలకాలని కోరారు. నంద్యాల ఉపఎన్నిక సందర్భంగా శిల్పా మోహన్ రెడ్డితో కలిసి ఆయన కానాలో రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ...‘ఇవాళ జరిగేది ధర్మానికి, అధర్మానికి మధ్య జరుగుతున్న ఉప ఎన్నిక. మీరందరూ ధర్మంవైపు నిలబడి ఓటు వేయండి. నంద్యాలను నా గుండెల్లో పెట్టుకుంటా. రాబోయే రోజుల్లో మన నవరత్నాల పథకాలు ప్రతి ఇంటికి చేరాలి. ఆ నవరత్నాలు ప్రతి ఇంటికి చేరితే, పేదవాడు అనేవాడు ఉండడు. విలువలతో కూడిన రాజకీయం చేయడమే నాకు తెలుసు. నవరత్నాలతో మీ అందరి జీవితాలలో వెలుగులు నింపుతా. దేవుడి దయ, మీ ఆశీస్సులు నాకున్నాయి.