రుణమాఫీ పేరుతో చంద్రబాబు రైతులను మోసం చేశారని, రూ.5వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తామన్న ఆయన మాటలు ఏమయ్యాయని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రశ్నించారు. ఇప్పుడు మిర్చి పంటను కూడా నడిరోడ్డుపై తగలబెట్టే పరిస్థితి ఏర్పడిందని, చివరకు డ్వాక్రా అక్కాచెల్లెమ్మలను కూడా చంద్రబాబు మోసం చేశారని విమర్శించారు. నంద్యాల ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా నాలుగో రోజు శనివారం వైఎస్ జగన్ రోడ్ షో... గోస్పాడు, శ్రీనివాసపురం, యాలూరు మీదగా కొనసాగింది.