వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయితే నంద్యాలను జిల్లాగా ప్రకటించాలని శిల్పా మోహన్‌రెడ్డి కోరారు. నంద్యాలలో గురువారం జరిగిన వైఎస్సార్ సీపీ నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ‘అనాథలను ఆశీర్వదించాలని అఖిలప్రియ అంటున్నారు. అఖిలప్రియ అనాథ ఎందుకయ్యారు. ఆమె తండ్రి ఎంతమందిని అనాథలుగా మార్చారు. అనాథ బిడ్డలెవరో చెప్పాలి. ముస్లింలకు నేను అండగా ఉన్నాను. షాదీఖానాలు, మసీదులు అభివృద్ధి చేశా. కానీ ఫరూఖ్ నాపై విష ప్రచారం చేస్తున్నారు. ముస్లింలను నేనెప్పుడూ ఇబ్బంది పెట్టలేదు. ఒకవేళ అలా భావిస్తే క్షమాపణ చెబుతున్నా. ముస్లింలకు నేను అండగా నిలబడతాను. రాజకీయల్లో కులమతాలు వాడుకోవద్దని టీడీపీ నాయకులకు విజ్ఞప్తి చేస్తున్నా. వైఎస్ జగన్ కుటుంబానికి చివరి వరకు తోడుంటాను. ఊపిరి ఉన్నంతవరకు జగన్ వెంటే ఉంటామ’ని శిల్పా మోహన్‌రెడ్డి అన్నారు.