
నంద్యాల సీటు మాకే.. కాదు మాకే!
గుంటూరు: నంద్యాల ‘సీటు’ పంచాయితీ ఇంకా తేలలేదు. టికెట్ తమకే కేటాయించాలంటూ ఇప్పటికే కోరిన శిల్పాబ్రదర్స్ ఆదివారం మరోసారి ముఖ్యమంత్రి చంద్రబాబును కలిశారు. శిల్పామోహన్‌రెడ్డి తనకే టికెట్ ఇవ్వాలని పట్టుబడుతున్నారు. '2014లో పార్టీ తరఫున నేనే పోటీ చేశా. ఈసారి కూడా టికెట్ నాకు ఇవ్వడమే న్యాయం. మేం అన్ని రకాలుగా నష్టపోయాం’ అని సీఎంను కలిసిన అనంతరం శిల్పామోహన్‌రెడ్డి అన్నారు. ‘నంద్యాల సీటు మాకే ఇవ్వాలి’ అని ముఖ్యమంత్రిని కోరినట్లు ఆయన వెల్లడించారు.
కాగా, మంత్రి భూమా అఖిలప్రియ సైతం ఈ వ్యవహారంపై నేడు ముఖ్యమంత్రిని కలిశారు. సంప్రదాయం ప్రకారం టికెట్ తమకే ఇవ్వాలని ఆమె పట్టుబడుతున్నారు. ఇలా నంద్యాల టికెట్ వివాదం రెండు రోజులుగా ముఖ్యమంత్రి వద్ద కొనసాగుతోంది.