సాక్షి, కర్నూల్ : భవిష్యత్తులో వైఎస్సాఆర్‌సీపీ అధికారంలోకి రావటం.. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి కావటం ఖాయమని ఆ పార్టీ నేత శిల్పామోహన్‌రెడ్డి చెబుతున్నారు. ప్రజాసంకల్పయాత్ర నేడు కర్నూల్ జిల్లాలో ముగియనున్న నేపథ్యంలో ‘సాక్షి’ మోహన్‌రెడ్డిని పలకరించింది. ఈ సందర్భంగా ఆయన జిల్లాలో పాదయాత్ర విజయవంతమైనట్లు చెప్పారు.
రాష్ట్రంలో ప్రజలు వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని బలంగా కోరుకుంటున్నారని ఆయన ఈ సందర్భంగా అన్నారు. ‘‘అందుకు రెండు కారణాలు ఉన్నాయి. ఒకటి తెలుగుదేశం పార్టీ, ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత నెలకొంది. అదే సమయంలో వైఎస్ జగన్‌పై వారిలో నెలకొన్న సమ్మోహన శక్తి. ఈ రెండూ కూడా వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా మారబోతున్నాయని శిల్పా చెప్పారు. జిల్లాలో రైతులు, యువకులు ఇలా ప్రతీ ఒక్క వర్గం నుంచి వైఎస్ జగన్ పాదయాత్ర వైపు మొగ్గుచూపటంతో విజయవంతం అయ్యిందని, వారి ఆశీర్వాదం జననేతకు నూటికి నూరుపాలు ఉంటాయని మోహన్‌రెడ్డి అన్నారు.
ఇక పాదయాత్రలో ఇరిగేషన్ మీద ఎక్కువ సమస్యలు జగన్ దృష్టికి వచ్చాయన్న ఆయన.. దివగంత నేత వైఎస్ ప్రారంభించిన ప్రాజెక్టుల కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారన్నారు. అందుకు వైఎస్ జగన్ ముఖ్యమంత్రి కావాల్సిందేనన్న భావన ప్రజల్లో నానాటికీ పెరిగిపోతుందని శిల్పామోహన్‌రెడ్డి చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment