కర్నూలు (కొండారెడ్డి ఫోర్టు) :కన్నీటి కథలు.. ఎన్నో కదిలించే వ్యథలు.. దగా పడిన అన్నదాత గుండె చప్పుళ్లు.. చీకట్లు అలుముకున్న పల్లెలు.. ఉపాధి లేని నిరుద్యోగులు.. ఏ ఊరు చూసినా ఇదే దుస్థితి. ఈ పరిస్థితుల్లో నేనున్నానంటూ జననేత అలుపెరగని పాదయాత్ర చేస్తూ జిల్లాలోకి అడుగు పెట్టినప్పటి నుంచి వైఎస్‌ఆర్‌సీపీ శ్రేణులు వెంట నడిచాయి. ప్రజల కష్టనష్టాలను తెలుసుకుంటూ.. మీకేం కాదంటూ.. అవ్వతాతలను ఓదార్చుతూ.. అక్కాచెల్లెమ్మలకు అండగా ఉంటూ.. చిన్నా..పెద్దా తేడా లేకుండా అందరనీ కలుసుకుంటూ వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ముందుకు వెళ్తుండగా.. జనం ఆప్యాయత, అనురాగాలను చూసి పార్టీ నాయకులు, అభిమానులు మురిసిపోయారు. ఈ నెలలో ప్రజా సంకల్పయాత్ర ముగుస్తున్న నేపథ్యంలో పాదయాత్రలో పాల్గొన్న పలువురు తమ అభిప్రాయాలను ‘సాక్షి’తో పంచుకున్నారు. ఆ అడుగులు చరిత్రాత్మకమని.. ప్రజల కష్టాలను దగ్గరగా చూశామన్నారు.
భాగస్వామ్యమైనందుకుసంతోషంగా ఉంది
వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చరిత్ర సృష్టించారు. సమీప భవిష్యత్‌లో ఎవరూ చేయని విధంగా పాదయాత్రలో 3,630 కిలోమీటర్ల దూరం నడిచారు. అడుగడుగునా ప్రజా సమస్యలు తెలుసుకున్నారు. జిల్లాలో 18 రోజులపాటు కొనసాగిన పాదయాత్రలో పాల్గొనడం సంతోషంగా ఉంది. – శిల్పా చక్రపాణిరెడ్డి, నంద్యాల పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు
ప్రజలకు భరోసా ఇచ్చారు
వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి పాదయాత్ర చారిత్రాత్మకం. దేశంలో ఏ నాయకుడు చేయని విధంగా కోట్లాది మంది ప్రజల సమస్యలు తెలుసుకొని ముందుకు సాగారు. ఎక్కడి సమస్యలు అక్కడే తెలుసుకొని పరిష్కారానిని మార్గాలను చూపుతూ భరోసా కల్పించారు.– బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, పీఏసీ చైర్మన్
బీసీలకు పెద్ద పీట వేస్తామన్నారు
కర్నూలు జిల్లాలో అధికంగా బీసీలు ఉన్నారు. బీసీలకు అండగా పార్టీ నిలవాలని కోరాను. అందుకు ఆయన సానుకూలంగా స్పందించారు. బీసీలను చట్టసభలకు పంపుతానని చెప్పారు.అన్ని కులాలు సామాజిక, ఆర్థికంగా ఎదిగేందుకు కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తానన్నారు.– డాక్టర్ మధుసూదన్, ఆదోని
ఆయన వెంట నడవడంమా అదృష్టం
జగనన్న మా మధ్యకే రావడం మా అదృష్టం. నేను గోనెగొండ్ల నుంచి పత్తికొండ వరకు పాదయాత్రలో పాల్గొన్నాను. ఆయన నా చేయి పట్టుకొని ఆలూరు నియోజకవర్గంలో సమస్యలేమని అడిగారు. వేదవతి ప్రాజెక్ట్ కట్టాలని కోరాను. పరిశ్రమలు స్థాపించి ఉపాధిని కల్పించాలని అడిగాను. – రామకృష్ణ, ఆలూరు
ప్రజా వ్యతిరేక పాలనపై పోరాడాలని చెప్పారు
జిల్లాలో జరిగిన పాదయాత్రలో మొదటి నుంచి చివరి రోజు వరకు పాల్గొన్నాను. 18 రోజులు నడిచాను. నేను జగనన్నను కలిసిన సందర్భంలో టీడీపీ ప్రజా వ్యతిరేక పాలనపై పోరాడాలని పిలుపునిచ్చారు. ఆ స్ఫూర్తితోనే నిరసనలు, ఆందోళనలో పాల్గొంటున్నాను. – కరుణాకర్‌రెడ్డి, ఎమ్మిగనూరు
అపూర్వ స్పందన
వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప పాదయాత్రకు జిల్లాలో విశేష స్పందన లభిచింది. ఏ నాయకుడికి లభించనంతగా ఆయనకు మద్దతు తెలిపి స్వాగతించారు. పత్తికొండలో జరిగిన బహిరంగకు రికార్డు స్థాయిలో ప్రజలు హాజరయ్యారు. పత్తికొండ చరిత్రలో ఇంత పెద్ద సభ జరగలేదు. – శ్రీరంగడు, పత్తికొండ
వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన పాదయాత్ర జిల్లాలో విజయవంతమైంది. అందులో నేను భాగస్వామ్యం కావడం సంతోషకరం. జిల్లాలో 263 కిలోమీటర్ల మేర పాదయాత్రలో పాల్గొన్నాను. పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయాలని జగనన్నకు నివేదిక ఇచ్చాను. – తెర్నేకల్ సురేందర్‌రెడ్డి, కర్నూలు
నీరాజనం పలికారు
ప్రజా సంకల్ప పాదయాత్రకు జిల్లాలో జనం జేజేలు పలికారు. కోవెలకుంట్ల, బనగానపల్లె సభ లకు జనం పొటెత్తారు. పాదయాత్రకు దారిపొడవునా ప్రజలు వచ్చి వారి సమస్యలు చెప్పుకున్నారు. దేశంలో ఏ నాయకుడు ఈ మాదిరిగా ప్రజా సమస్యలను తెలుసుకోలేదు.– శీలారెడ్డి, నొస్సం సుబ్బారెడ్డి, బనగానపల్లె
త్వరలో మొక్కు తీర్చుకుంటా
వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన పాదయాత్ర విజయవంతం కావాలని వెంకటేశ్వరస్వామిని కోరుకున్నా. ఎలాంటి ఆటంకాలు లేకుండా పూర్తి అయితే తలనీలాలు ఇస్తానని మొక్కుకున్నా. పాదయాత్ర విజయవంతంగా కొనసాగింది. త్వరలోనే వెంకటేశ్వరస్వామికి మొకు తీర్చుకుంటా. – రాజావిష్ణువర్ధన్‌రెడ్డి, కర్నూలు నగర అధ్యక్షుడు
నవంబర్ 16న..
ఆళ్లగడ్డ మండలం పెద్ద చింతకుంట పాఠశాల విద్యార్థులు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని చూడకుండా స్కూలు నిర్వాహకులు గేటు వేశారు. అయితే అభిమానాన్ని అరచేతితో అపలేరన్న నిజాన్ని నిజం చేస్తూ విద్యార్థులు గేటులోపల నుంచే వైఎస్ జగన్‌ను తిలకించారు.
Comments
Please login to add a commentAdd a comment