
సాక్షి, కర్నూలు : వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజాసంకల్పయాత్ర భారీ జనసందోహం నడుమ 23వ రోజు ప్రారంభం అయ్యింది. ఆలూరు నియోజకవర్గం ఆస్పరి మండలం బిల్లేకల్ నుంచి పాదయాత్రను వైఎస్ జగన్ మొదలుపెట్టారు. జుటూర్ లో జెండా ఆవిష్కరణ, చిన్నహుళ్తిలో ముఖాముఖి కార్యక్రమం ఏర్పాటు చేయనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు పత్తికొండలో భోజన విరామం తీసుకుంటారు.
అనంతరం పత్తికొండ అంబేద్కర్ సర్కిల్ నుంచి ప్రజాసంకల్పయాత్రను పున:ప్రారంభిస్తారు. సాయంత్రం నాలుగు గంటలకు పత్తికొండలోని ఊరు వాకిలి సెంటర్ వద్ద బహిరంగ సభలో వైఎస్ జగన్ ప్రసంగిస్తారు.
Comments
Please login to add a commentAdd a comment