వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డి శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. ఈ రోజు ఉదయం ఆయన తన ఇంటి వద్ద నుంచి పార్టీ నాయకులు, కార్యకర్తలు, అనుచరులతో కలిసి ర్యాలీగా ఆర్డీవో కార్యాలయానికి వచ్చారు. అనంతరం శిల్పా మోహన్ రెడ్డి రెండు సెట్ల నామినేషన్ పత్రాలు సమర్పించారు.