
సాక్షి, కర్నూలు: ఎన్నికల వేళ అధికార టీడీపీకి వరుస షాక్‌లు తగులుతున్నాయి. టీడీపీ టికెట్‌పై పోటీ చేయడానికి అభ్యర్థులు వెనుకంజ వేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే టీడీపీ నుంచి నెల్లూరు రూరల్ సీటు కైవసం చేసుకున్న అదాల ప్రభాకర్ ఆ పార్టీని వీడిన సంగతి తెలిసిందే. తాజాగా శ్రీశైలంలో టీడీపీ ప్రకటించిన అభ్యర్థి పోటీ చేసేందుకు సంసిద్ధత చూపడం లేదని తెలుస్తోంది.
వివరాల్లోకి వెళితే.. టీడీపీ ఇటీవల శ్రీశైలం నుంచి తమ పార్టీ అభ్యర్థిగా బుడ్డా రాజశేఖర్‌రెడ్డిని ప్రకటించింది. అయితే ఆయన పోటీ చేసేందుకు సంసిద్దత చూపడం లేదని సమాచారం. ఓటమి భయంతో ఆయన బరిలో నిలిచేందుకు ఆసక్తి చూపడం లేదు. దీనిపై చర్చించడానికి ఆయన సాయంత్రం వెల్పనూరులో కార్యకర్తలతో భేటీ కానున్నారు. టీడీపీ ఇంకా పలు స్థానాల్లో అభ్యర్థులు ప్రకటించాల్సి ఉండగానే.. ఈ పరిణామాలు చోటుచేసుకోవడం టీడీపీలో కలకలం రేపుతోంది. (తొలి రోజే టీడీపీకి షాకిస్తున్న రెబల్స్.. )
Comments
Please login to add a commentAdd a comment