
వైఎస్ జగన్‌తో శిల్పా చక్రపాణిరెడ్డి భేటీ
హైదరాబాద్: టీడీపీకి రాజీనామా చేసిన కర్నూలు జిల్లా నాయకుడు శిల్పా చక్రపాణిరెడ్డి బుధవారం రాత్రి ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నాయకుడు, వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని కలిశారు. నంద్యాల నుంచి హైదరాబాద్‌కు వచ్చిన ఆయన నేరుగా జగన్ దగ్గరకు వెళ్లి కలిశారు. తాను టీడీపీకి రాజీనామా చేయడానికి దారితీసిన పరిస్థితులను జగన్‌కు వివరించారు. వైఎస్ జగన్ సమక్షంలో రేపు ఆయన వైఎస్సార్ సీపీలో చేరనున్నారు.
‘రేపు నంద్యాల బహిరంగ సభలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరతా. నంద్యాల గెలుపును జగన్‌కు బహుమతిగా ఇస్తామ'ని శిల్పా చక్రపాణిరెడ్డి అంతకుముందు అన్నారు. మరోవైపు నంద్యాల ఎస్పీజీ మైదానంలో నిర్వహించనున్న బహిరంగ సభకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. రేపు మధ్యాహ్నం మూడు గంటలకు భారీ బహిరంగ సభను ఉద్దేశించి జగన్ ప్రసంగిస్తారు.