వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి రోజురోజుకు మద్దతు పెరుగుతోంది. వైఎస్సార్ సీపీలోకి చేరికలు కొనసాగుతున్నాయి. కర్నూలు జిల్లా పొన్నాపురానికి చెందిన 200 కుటుంబాలు శిల్పా చక్రపాణిరెడ్డి ఆధ్వర్యంలో బుధవారం వైఎస్సార్ సీపీలో చేరాయి. ఈ సందర్భంగా శిల్పా చక్రపాణిరెడ్డి మాట్లాడుతూ.. నంద్యాల ఉప ఎన్నిక ధర్మానికి, అధర్మానికి మధ్య జరుగుతున్న యుద్ధమని పేర్కొన్నారు. వైఎస్సార్ సీపీ కార్యకర్తల మీద అక్రమ కేసులు బనాయిస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. శిల్పా కుటుంబం ఇప్పటివరకు ఏ తప్పు చేయలేదని, చేయదని అన్నారు. చంద్రబాబు కుట్రలు నంద్యాలలో సాగవని పేర్కొన్నారు. నంద్యాల ప్రజలు కుయుక్తులు, ప్రలోభాలకు లొంగరని స్పష్టం చేశారు.
Published Wed, Aug 9 2017 1:17 PM | Last Updated on Fri, Mar 22 2024 11:07 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement