
సాక్షి, కర్నూలు : ప్రత్యేక హోదా విషయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పూటకో మాట మాట్లాడుతూ ప్రజలను మోసం చేస్తున్నారని వైఎస్సార్ సీపీ నాయకుడు శిల్పా చక్రపాణి రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. ఆయన సోమవారం ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ.. మొదటి నుంచి ప్రత్యేక హోదా సాధించడం కోసం అనేక కార్యక్రమాలు చేసిన ఘనత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిదేనని, ప్రత్యేక హోదాపై జగన్‌కు క్రెడిట్ దక్కకూడదనే పవన్‌తో కలిసి బాబు నాటకాలు ఆడుతున్నారని మండిపడ్డారు.
పవన్ కళ్యాణ్ మిడిమిడి జ్ఞానంతో మాట్లాడుతున్నారని, రాజకీయలంటే సినిమాలు తీసినంత ఈజీ కాదంటు విమర్శించారు. మార్చి ఒకటో తేదీన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేపట్టదల్చిన కలెక్టరేట్ల ముట్టడిని విజయవంతం చేయాలని శిల్పా చక్రపాణిరెడ్డి ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. మార్చి మూడో తేదీన పార్టీ ఎమ్మెల్యేలు, ఇంచార్జ్‌లు, ముఖ్యనాయకులంతా జగన్ మోహన్ రెడ్డిని కలిసి, అయిదో తేదీన ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద మహాధర్నాలో పాల్గొంటామని తెలిపారు. తెలుగు ప్రజల మనోభావాలు, ఆకాంక్షలు ఢిల్లీలో వినిపిద్దాం.. ప్రత్యేక హోదా సాధిద్దాం.. అంటు ఆయన నినాదం ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment