women attempt suicide
-
భర్త వేధింపులు: ఎస్ఐ న్యాయం చేయడం లేదని..
సాక్షి, టేకులపల్లి: టేకులపల్లి పోలీసు స్టేషన్ ఆవరణలో ఓ వివాహిత పురుగు మందు తాగి నిరసన తెలిపింది. ఈ ఘటన ఆదివారం చోటుచేసుకుంది. బేతంపూడి స్టేజీకి చెందిన గుగులోత్ భద్రు కుమార్తె ప్రేమకు గోలియాతండాకు చెందిన వాంకుడోత్ కుమార్‌తో నాలుగేళ్ల క్రితం వివాహమైంది. రెండేళ్ల నుంచి ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. పరస్పరం పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసుకున్నారు. పెద్దలు పంచాయితీలు కూడా చేశారు. కాగా ఈ కేసు విషయంలో ఎస్ఐ తనకు న్యాయం చేయడం లేదని, ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని మనస్తాపానికి గురైన వివాహిత తనతో తెచ్చుకున్న పురుగు మందు తాగింది. తనను భర్త కుమార్ తరచూ వేధిస్తున్నాడని, విడాకులు కోసం కుట్ర చేస్తున్నారని, ఎస్ఐ కూడా పట్టించుకోవడం లేదని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది. వెంటనే పోలీసులు ఆటోలో ఆసుపత్రికి తరలించారు. బాధితురాలు పాల్వంచ ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఈ విషయమై ఎస్ఐ ఇమ్మడి రాజ్‌కుమార్‌ను వివరణ కోరగా...పుట్టింటికి వెళ్లిన తన భార్య ప్రేమ కాపురానికి రావడం లేదని భర్త కుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ కోసం పిలిపించామని తెలిపారు. ఇద్దరికి నచ్చజెప్పి కాపురాన్ని నిలబెట్టేందుకు యత్నిస్తున్న క్రమంలో స్టేషన్ నుంచి బయటకు వెళ్లి ఏదో తెలియని ద్రవం తాగిందని పేర్కొన్నారు. చట్ట ప్రకారమే చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. కాగా బాధితురాలి భర్త కుమార్ మాట్లాడుతూ.. ప్రేమ రెండో కాన్పు కోసం పుట్టింటికి వెళ్లి ఎంతకీ రాలేదని, తమపైనే స్టేషన్లో ఫిర్యాదు చేసిందని పేర్కొన్నారు. స్టేషన్లో పురుగు మందు తాగడానికి తనకు, ఎలాంటి సంబంధం లేదని తెలిపాడు. చదవండి: రెండేళ్ల ప్రేమ.. పెళ్లనగానే! -
‘నేను చచ్చిపోతా.. నా భర్తను కాపాడండి’
ముంబై : ఆపద నుంచి కాపాడే పోలీసులే తమను సమస్యల్లోకి నెట్టారని ఓ మహిళ ఆవేదన వ్యక్తం చేశారు. తమకు సంబంధం లేని నేరాన్ని అంటగట్టి బలవంతంగా కేసులో ఇరికించాలని చూస్తున్నారని వాపోయారు. ‘నేను చనిపోవాలి అనుకుంటున్నాను. నా భర్తను మాత్రం రక్షించండి’ అంటూ ఎత్తైన భవంతి నుంచి దూకి ఆత్మహత్యకు యత్నించారు. ఈ ఘటన మహరాష్ట్రలో శుక్రవారం చోటుచేసుకుంది. థానే జిల్లాకు చెందిన 23 ఏళ్ల మహిళ భర్తతో కలిసి ఉల్హాస్‌నగర్‌లో జ్యూస్ సెంటర్‌ను నడుపుతున్నారు. అయితే గత కొంత కాలంగా తనను, తన భర్తను పోలీసులు వేధింపులకు గురి చేస్తున్నారని, తమపై దాడికి పాల్పడ్డారని.. మహారాష్ట్ర సచివాలం అయిదవ అంతస్తు నుంచి దూకింది. అయితే పోలీసులు అప్రమత్తమయ్యి రెండవ అంతస్తులో.. వల(నెట్) ఏర్పాటు చేయడంతో మహిళ స్వల్ప గాయాలతో బయటపడింది. అనంతరం మహిళను ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. ఇక ఈ ఘటనపై మహిళ సోదరుడు స్పందిస్తూ.. తన సోదరి మరో మహిళతో కలిసి తమ సమస్యను అధికారులకు విన్నవించి.. న్యాయం జరిపించాలని శుక్రవారం సచివాలయానికి వెళ్లిందని తెలిపారు. అయితే తన వద్ద సరైన గుర్తింపు పత్రాలు లేకపోవడంతో అధికారులు లోపలికి వెళ్లనివ్వలేదని ఆరోపించారు. లోపల ఏం జరిగిందో తనకు తెలీదన్నారు. కాగా సోదరి, తన భర్తపై పాత స్నేహితులతో కలిసి స్థానిక పోలీసులు దాడి చేశారని ఆరోపిస్తూ.. ఇప్పటికైనా తన సోదరికి న్యాయం చేయాలని అధికారులను వేడుకున్నారు. -
పోలీస్‌స్టేషన్‌లో పురుగుల మందుతాగిన మహిళ
మిర్యాలగూడ అర్బన్ : పోలీసులకు ఫిర్యాదు చేసినా తమకు న్యాయం జరగలేదని మనస్తాపం చెందిన మహిళ పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించింది. ఈ సంఘటన పట్టణంలోని వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌లో మంగళవారం చోటు చేసుకుంది. బాధిరాలు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని చింతపల్లి గ్రామానికి చెందిన బట్టు రవి అతడి భార్య సునీత పట్టణంలోని ఈదులగూడ వద్ద వినాయక విగ్రహాలు తయారు చేయడానికి రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన సోనుతో కలిసి ఒప్పందం కుదుర్చుకున్నారు. విగ్రహాల తయారికి సుమారు రూ.4 లక్షలకుపైగా ఖర్చు పెట్టారు. విగ్రహాలు పూర్తికావచ్చిన తరుణంలో పట్టణానికి చెందిన ప్రసాద్ రెండు నెలలుగా విగ్రహాల తయారికి పెట్టిన పెట్టుబడిని మీకు వడ్డీతో ఇస్తానని ఆ మెత్తం విగ్రహాలను వదిలి వెళ్లాలని రవిని వేధించసాగాడు. ఈ క్రమంలో వీరిద్దరి మధ్య గొడవలు సైతం జరిగాయి. దీంతో ప్రసాద్‌పై పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అయినా ప్రసాద్ వేధిస్తుండడంతో.. రవి విగ్రహాల తయారీ వద్దకు రావడంలేదు. భయాందోళనకు గురైన రవి భార్య సునీత పోలీస్‌స్టేషన్‌లో కేసు పెట్టమని లేకుంటే విగ్రహాల తయారీకి పెట్టిన పెట్టుబడిరాకుంటే అప్పుల పాలవుతామని చెప్పడంతో తిరిగి సోమవారం రవి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. అయినా పోలీసులు ప్రసాద్‌పై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో మనస్తాపానికి గురైన సునీత మంగళవారం సాయంత్రం వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్ వెళ్లి పురుగుల మందు తాగింది. గమనించిన పోలీసులు వెంటనే ఏరియా ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉందని ఏరియా ఆస్పత్రి వైద్యులు తెలిపారు. ఈ విషయమై వన్‌టౌన్ సీఐ జి.వెంకటేశ్వర్‌రెడ్డిని వివరణ కోరగా ఇరువురు పడిన గొడవలో గతంలో కేసు పెట్టామని, ప్రసాద్ బెదిరింపులకు పాల్పడుతున్నట్లు మా దృష్టికి రాలేదని పేర్కొన్నాడు. -
అధికారుల తీరుతో విసిగి..
మాయదారి తుపాను సర్వం నాశనం చేసి రోడ్డున పడేసింది. ఉండడానికి గూడు లేక..తినేందుకు తిండిలేక..బతుకునీడ్చడానికి పని లేక అవస్థలు పడుతున్నానంటూ ఓ బాధితురాలు అధికారులకు పలుమార్లు విన్నవించుకుంది. అయినా అధికారుల్లో చలనం కనిపించలేదు. కనీసం కలెక్టర్‌ను కలిసి మొరపెట్టుకుందామని యత్నిస్తే కలిసే అవకాశం దొరకలేదు. దీంతో మనస్తాపం చెందిన ఓ మహిళ బతుకుపై తీపిని వదిలేసి ఆత్మాహుతికి యత్నించింది. రాయగడ : వేసవికాలంలో తాత్కాలికంగా నిలిపివేసిన గ్రీవెన్స్‌సెల్‌ను పునఃప్రారంభించిన రాయగడలో తొలిరోజే అపశ్రుతి దొర్లింది. కలెక్టర్ గుహపూనాంతపస్ కుమార్ సోమవారం నిర్వహిస్తున్న గ్రీవెన్స్‌సెల్ దగ్గర జిల్లా యంత్రాంగం తీరుపై మనస్తాపం చెందిన ఓ మహిళ ఆత్మాహుతి యత్నానికి ఒడిగట్టింది. ఆమె యత్నాన్ని గమనించిన పోలీసులు అడ్డుకున్నారు. వివరాలిలా ఉన్నాయి. తనను ఆదుకోవాలని రాయగడ ఒక ఏడాదిగా కలెక్టర్‌కు ఎన్నోసార్లు విన్నవించినప్పటికీ ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో గ్రీవెన్స్ సెల్లో కలెక్టర్‌ను కలిసేందుకు సోమవారం ప్రయత్నించింది. అయితే కలెక్టర్‌ను కలిసేందుకు ఆమెకు అనుమతి లభించక పోవడంతో మనస్తాపం చెంది ఆత్మాహుతి చేసుకునేందుకు యత్నించింది. జిల్లాలోని కల్యాణసింగుపురం సమితిలో గత ఏడాది సంభవించిన వరదల కారణంగా సంపూర్ణంగా ఆస్తి, ఇల్లు, కొట్టుకుపొయి అనాథగా మిగిలిన మమతరాణిసాహు తనకు సహాయం అందించాలని కోరుతూ ఏడాది కాలంగా కాళ్లరిగేలా తిరుగుతూ కలెక్టర్‌కు విన్నవించినప్పటగికీ ఆమె సమస్య పరిష్కరం కాలేదు. దీనిపై కలెక్టర్‌ను కలవాలని ప్రయత్నించి విఫలం కావడంతో గ్రీవెన్స్ కార్యాలయం గేటు వద్ద కిరసనాయిల్ పోసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించింది. తక్షణం గేటు వద్ద పోలీసులు స్పందించి ఆమె దగ్గర నుంచి కిరసనాయిల్ డబ్బాను స్వాధీనం చేసుకుని ఆమెను అదుపులోకి తీసుకున్నారు. రాయగడలో గ్రీవెన్స్ సెల్ ప్రారంభం వేసవికాలం మూడు నెలలు ఎండల తీవ్రతను దృష్టిలో పెట్టుకుని తాత్కాలికంగా నిలిపివేసిన గ్రీవెన్స్ సెల్‌ను రాయగడలో సోమవారం ప్రారంభించారు. ఎండలు పూర్తయి వర్షాలు కురవడం ప్రారంభం కావడంతో మళ్లీ గ్రీవెన్స్‌సెల్ నిర్వహించాలని ఆదేశాలు అందాయి. దీంతో రాయగడ కలెక్టర్ గుహపూనాంతపస్‌కుమార్ కలెక్టరేట్లో గ్రీవెన్స్‌సెల్‌ను నిర్వహించారు. కార్యక్రమంలో కలెక్టర్, ఎస్పీ రాహుల్‌పీఆర్, ఏడీఎం, డీఆర్డీఏ పీడీ సహా 32విభాగా జిల్లా అధికారులు గ్రీవెన్స్ సెల్లో పాల్గొన్నారు. ఈ గ్రీవెన్స్‌సెల్‌కు వికలాంగులు, వితంతువులు, మారుముల గ్రామీణ ప్రజలతో సహా వృద్ధులు వ్యక్తిగత సమస్యలు, గ్రూపు సమస్యలు, నాణ్యమైన వైద్యానికి సంబంధించి ముఖ్యమంత్రి నిధి నుంచి ఆర్థిక సహాయం కోరే వారు భారీ సంఖ్యలో హాజరయ్యారు. -
ఇంటి పైనుంచి దూకిన మహిళ
అత్తాపూర్ : వరకట్న వేధింపులు భరించలేక ఓ గృహిణి ఆత్మహత్యాయత్నం చేసిన సంఘటన రాజేంద్రనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని శుక్రవారం చోటు చేసుకుంది. రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలోని అత్తాపూర్ తేజస్వినీనగర్ ప్రాంతానికి చెందిన నీలం అగర్వాల్(28), శివఅగర్వాల్‌లు దంపతులు. వీరికి ఐదేళ్ల క్రితం వివాహం జరిగింది. కాగా గత కొద్దిరోజులుగా శివ, అతడి తల్లి విజయలక్ష్మి అదనపు కట్నం తేవాలని నీలం అగర్వాల్‌ను మానసికంగా, శారీరకంగా వేధిస్తున్నారు. గత రెండు రోజులుగా వేధింపులు ఎక్కువ కావడం, భర్త శివకు ఎంత చెప్పినా వినిపించుకోకపోవడంతో నీలం తీవ్ర నిరాశకు గురైంది. ఇదే క్రమంలో విజయలక్ష్మి నీలంను అదనపు కట్నం తీసుకురావాలని గొడవ పడటంతో విషయాన్ని భర్త శివకు తెలిపింది. దీంతో అతడు నీలంను కొట్టి తను ఇంట్లో నుంచి వెళ్లిపొతానంటూ బెదిరించాడు. గొడవలు భరించలేక అదనపు కట్నం తీసుకురాలేనని నీలం అగర్వాల్ శుక్రవారం ఉదయం ఇంటిపైకి ఎక్కి కిందకు దూకి ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ ఘటనలో నీలం రెండు కాళ్లకు తీవ్రగాయాలయ్యాయి. హుటాహుటిన ఆమెను హైదర్‌గూడలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. కాగా విషయం తెలుసుకున్న రాజేంద్రనగర్ పోలీసులు ఘటన స్థలానికి చేరుకోని వివరాలు సేకరించారు. నీలం అగర్వాల్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా భర్త, అత్తపై వరకట్న వేధింపు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వెంకటేష్ తెలిపారు. -
ఆత్మహత్యాయత్నంతో మతిస్థిమితం కోల్పోయిన మహిళ
సర్పవరం (కాకినాడ సిటీ) : టీడీపీ మహిళా నాయకురాలు తనను వేధిస్తోందంటూ కాకినాడ ధర్మపోరాట దీక్షలో హోంమంత్రి చినరాజప్ప, ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు సమక్షంలో పురుగుమందు తాగి కాకినాడ ప్రభుత్వాసుపత్రి మెడికల్ విభాగం ఏఎంసీయూ–2లో చికిత్స పొందుతున్న మల్లాడి లక్ష్మి పరిస్థితి మూడురోజులైనా విషమంగానే ఉంది. ఆమెకు ముగ్గురు కుమార్తెలు సంధ్యకుమారి, అమృతవల్లీలకు వివాహం కాగా, మౌనికకు వివాహం కాలేదు. ఇదిలా ఉంటే తమ తండ్రి చేపలు వేటకు వెళ్లి కుటుంబాన్ని పోషిస్తాడని, తల్లి లక్ష్మి జీజీహెచ్‌లో సెక్యూరిటీగా పనిచేస్తుందని కుమార్తెలు తెలిపారు. వేట నిషేధం ఉండడంతో ప్రస్తుతం అమ్మ ఆదాయంపైనే ఆధారపడ్డామని, అమె ఆసుపత్రిలో అపస్మారక స్థితిలో ఉండడంతో తమ కుటుంబం మొత్తం రోడ్డున పడిందని కుమార్తెలు కన్నీటి పర్యంతమవుతున్నారు. వైద్యులు ఏడు రోజుల వరకు ఆమె పరిస్థితిని చెప్పలేమంటున్నారని, ప్రస్తుతం విషమంగానే ఉందని చెప్పారని వారు రోధిస్తున్నారు. -
తిరుపతిలో మహిళల ఆత్మహత్యాయత్నం
తెలంగాణ బిల్లుకు వ్యతిరేకంగా తిరుపతిలో తెలుగుతల్లి విగ్రహం వద్ద వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో మహా ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాకు సమైక్యవాదులు వేలాదిగా తరలి వచ్చారు. కాంగ్రెస్ వైఖరిని ఎండగడుతూ, రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలంటూ పెద్దపెట్టున నినాదాలు చేశారు. ధర్నా సందర్భంగా కొంతమంది మహిళలు ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశారు. వారిలో సీత, రమణమ్మ అనే మహిళలకు గాయాలు కావడంతో వారిని ఆస్పత్రికి తరలించారు.