సాక్షి, హైదరాబాద్: కేంద్రంపై యుద్ధం ఆరం భంకాదు.. సీఎం కేసీఆర్ పతనం ప్రారం భమైందని బీజేపీ ఎమ్మె ల్యే ఈటల రాజేందర్ వ్యాఖ్యానించారు. కేసీఆర్ ఎవరిపై యుద్ధం చేస్తారని ఆయన ప్రశ్నించారు. రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో గురువారం ఆయన మీడి యాతో మాట్లాడారు. హుజూరాబాద్‌లో తన గెలుపును జీర్ణించుకోలేక దాని నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు కేసీఆర్ కొత్త డ్రామాకు తెరతీశారని విమర్శించారు. ఈ ఫలితం తర్వాత టీఆర్‌ఎస్‌లోచాలా మంది పునరాలోచ నలో పడ్డారని అభిప్రాయపడ్డారు. కేసీఆర్‌కు, టీఆర్‌ఎస్‌కు, కేసీఆర్ కుటుంబానికి తెలంగాణలో ఇక భవిష్యత్ లేదన్నారు.
గత 45 రోజులుగా ధాన్యం రోడ్ల మీదే ఉన్నా రైతులు వరి కుప్పలపైనే ప్రాణాలు వదులుతున్నా సీఎం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. తనకే అన్నీ తెలుసనే అహం కారంతో చేస్తున్న పనులకు కేసీఆరే పూర్తి బాధ్యత వహించాలన్నారు. అధునాతన సాంకే తికతతో రైస్ మిల్లుల ఏర్పాటుకు సహకరి స్తామని సీఎం గతంలో చెప్పారే తప్ప దానిని అమలు చేయలేదని, సీఎంకు ముందుచూపు లేకపోవడంవల్లే ఈ దుస్థితి తలెత్తిందని అన్నారు. కేసీఆర్ తన కీర్తి గురించి తప్ప ప్రజల గురించి ఎప్పుడూ పట్టించుకోరని ఎద్దేవా చేశారు. రాష్ట్రానికి కరోనా వల్ల జరిగిన ఆర్థిక నష్టం కంటే కేసీఆర్ అనాలోచిత చర్యల వల్ల జరిగిందే ఎక్కువన్నారు.
Comments
Please login to add a commentAdd a comment