
5న మహాధర్నా జయప్రదం చేయండి...
రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక చర్యలకు నిరసనగా వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో 5వ తేదీ కలెక్టరేట్ వద్ద నిర్వహించనున్న మాహాధర్నా...
‘మచిలీపట్నం’ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల వైఎస్సార్ సీపీ నేతలు, కార్యకర్తల సమావేశంలో పార్థసారథి, నాని
రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక చర్యలకు నిరసనగా వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో 5వ తేదీ కలెక్టరేట్ వద్ద నిర్వహించనున్న మాహాధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మంగళవారం కంకిపాడులో జరిగిన సమావేశంలో ముఖ్య నేతలు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో తూర్పు కృష్ణా అధ్యక్షుడు, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని, దక్షిణ కృష్ణాఅధ్యక్షుడు, మాజీమంత్రి కె.పార్థసారథి, ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన, పార్టీనేతలు దుట్టా రామచంద్రరావు, బూరగడ్డ వేదవ్యాస్, ఉప్పాల రా్రంపసాద్ పాల్గొన్నారు.
కంకిపాడు : ‘ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలి. ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లి వారిని చైతన్య పరిచి ఉద్యమంలో భాగస్వాములను చేయాలి’ అని వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, దక్షిణ కృష్ణా అధ్యక్షుడు కొలుసు పార్థసారథి, తూర్పు కృష్ణా అధ్యక్షుడు, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని పిలుపునిచ్చారు. మచిలీపట్నం పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల ముఖ్య నాయకులు, కార్యకర్తలతో పట్టణంలోని పార్టీ కార్యాలయంలో మంగళవారం రాత్రి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పార్థసారథి మాట్లాడుతూ పార్టీ ఏదైనా బాధితులు మాత్రం ప్రతిపక్ష వైఎస్సార్ సీపీ పోరాట పంథా వైపు చూస్తున్నారన్నారు. పార్టీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి ఓ కమిటీని రాజధాని ప్రాంతమైన తుళ్లూరు పంపిన తరువాతే రైతులు, కౌలుదారులు, కూలీల అగచాట్లు వెలుగులోకి వచ్చాయని చెప్పారు. తేలప్రోలు పంచాయతీని టీడీపీ కార్యాలయంలా పచ్చ రంగు వేశారని, మద్దూరులో పల్లెకారుల గుడిని లాక్కునేందుకు చూస్తున్నారని చెప్పారు. రైతులు, డ్వాక్రా మహిళల రుణాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 5న మచిలీపట్నం కలెక్టరేట్ వద్ద నిర్వహించనున్న మహాధర్నాను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
రైతులు, డ్వాక్రా మహిళలకు అవస్థలు : నాని
రైతు, డ్వాక్రా రుణాలు రద్దు కాక ఆయా వర్గాల ప్రజలు అవస్థలు పడుతున్నారని పార్టీ తూర్పు కృష్ణా అధ్యక్షుడు కొడాలి నాని చెప్పారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలకు, అధికారంలోకి వచ్చాక చేపట్టే కార్యక్రమాలకు పొంతనే లేకదన్నారు. పామర్రు ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన మాట్లాడుతూ రుణమాఫీ జాబితా గందరగోళంగా ఉందని చెప్పారు. నేత బూరగడ్డ వేదవ్యాస్ మాట్లాడుతూ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలతో అన్ని వర్గాల ప్రజలు నష్టపోతున్నారన్నారు. రైతు నాయకుడు నరేంద్ర మాట్లాడుతూ రానున్న రోజుల్లో చంద్రబాబు, పవన్‌లను రాళ్లతో కొట్టే రోజులు ముందున్నాయని చేసిన వ్యాఖ్యలతో సమావేశంలో చప్పట్లు మారుమోగాయి. అవనిగడ్డ నియోజకవర్గ నేత సింహాద్రి రమేష్‌బాబు మాట్లాడుతూ మాట్లు వేస్తామంటూ వచ్చి ప్రజలను మోసం చేసి సత్తు సామాన్లతో ఉడాయించినట్లుగా బాబు వైఖరి ఉందని ఎద్దేవా చేశారు. రాష్ట్ర వైద్య విభాగం అధ్యక్షుడు, గన్నవరం నేత రామచంద్రరావు, జిల్లా అధికార ప్రతినిధి ఎం. రాము, స్టీరింగ్ కమిటీ ప్రతినిధులు అయూబ్‌ఖాన్, పఠాన్ కరీముల్లా ఖాన్, సయ్యద్‌బాబు, ఉయ్యూరు మండల కన్వీనర్ వి. శ్రీనివాస ప్రసాద్, తుమ్మల చంద్రశేఖర్(బుడ్డి), మద్దాలి రామచంద్రరావు, కొణతం గిరిధర్ పాల్గొన్నారు.