పాలన చేతకాక ధర్నాలు చేస్తున్న కేసీఆర్‌ | YS Sharmila Slams KCR Over Maha Dharna | Sakshi
Sakshi News home page

వైఎస్‌ఆర్‌టీపీ అధ్యక్షురాలు షర్మిల 

Published Fri, Nov 19 2021 2:36 AM | Last Updated on Fri, Nov 19 2021 2:36 AM

YS Sharmila Slams KCR Over Maha Dharna - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ముఖ్యమంత్రి కేసీఆర్‌కు పాలన చేతకాక ధర్నాలు చేస్తున్నారని వైఎస్‌ఆర్‌ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల ఎద్దేవా చేశారు. నేటి తెలంగాణను, రేపటి భవిష్యత్తును భ్రష్టు పట్టిస్తున్నారని మండిపడ్డారు. రైతుల నుంచి ధాన్యం కొను గోలు చేయకుండా పలాయనవాదాన్ని అవలం బిస్తున్నారని విమర్శించారు. కమీషన్ల కోసం కాంట్రాక్టర్లకు కోట్ల రూపాయలను ధారాదత్తం చేస్తారు కానీ.. రైతుల పంటను మాత్రం కొన లేరా అని ప్రశ్నించారు. ఈ సందర్భంగా ‘800 స్కూళ్లలో బువ్వ పెడ్తలె’.. ’ఉద్యోగం రాలేదని మనస్తాపంతో యువకుడి ఆత్మహత్య’.. అం టూ వార్తాపత్రికల్లో వచ్చిన కథనాలను గురు వారం తన ట్విట్టర్‌ ఖాతాలో షర్మిల పోస్ట్‌ చేశా రు.

నోటిఫికేషన్లు ఇవ్వకుండా నిరుద్యోగులను చావు బాట పట్టిస్తున్నారన్నారు. అంతే కాకుం డా బడి బువ్వ బంద్‌ పెట్టి పేద బిడ్డలను చదు వుకు దూరం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఖాళీ గా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయడం చేతకాదా అని నిలదీశారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే తన తొలి సంతకం.. ఉద్యోగ ప్రకటనల పైనే ఉంటుందని షర్మిల స్పష్టం చేశారు. నిరు ద్యోగులు ఎవరూ ఆత్మహత్య చేసుకోవద్దని.. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే ఖాళీలు భర్తీ చేస్తామని భరోసా కల్పించారు.  
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement